కాంగ్రెస్‌లో చేరిన తీన్మార్‌ మల్లన్న

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేల కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గెలుపే లక్ష్యంగా పార్టీలు వ్యూహాలకు పదునుపెడుతుంటే.. నేతలు కూడా తమకు కలిసొచ్చే పార్టీలోకి జంప్‌ చేస్తున్నారు. తాజాగా.. బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం, కేసీఆర్‌ కుటుంబం పై ఎప్పటికప్పుడు దుమ్మెత్తి పోసిన చింత పండు నవీన్‌ అలియాస్‌ తీన్మార్‌ మల్లన్న బుధవారం ఉదయం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఏఐసీసీ తెలంగాణ ఇంఛార్జ్‌ మానిక్‌ రావ్‌ ఠాక్రే, టీపీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో హస్తం గూటికి లోకి చేరారు. గత కొంత కాలంగా ఆయన కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారనే ప్రచారం జరగ్గా.. ఆ ప్రచారానికి తెర దించుతూ ఆయన హస్తం గూటికి చేరారు.గతంలో బీజేపీ పార్టీలో చేరిన మల్లన్న.. అందులో నుంచి బయటకు వచ్చి అధికార పార్టీతో పాటు బీజేపీపై కూడా తనదైన శైలిలో విరుచుకుపడుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ సపోర్ట్‌ చేస్తున్నట్టుగానే.. మల్లన్న తీరు ఉండటం ఆ పార్టీ నేతలతో సత్సంబంధాలు కొనసాగించటంతో హస్తం గూటికి చేరనున్నారనే ప్రచారం జోరుగా సాగింది. సోషల్‌ విూడియాను వేదికగా చేసుకొని కేసీఆర్‌ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో పోరాటం చేస్తున్న తీన్మార్‌ మల్లన్న.. జైలుకు కూడా వెళ్లి వచ్చారు. గతంలో జరిగిన హుజూర్‌నగర్‌ ఉపఎన్నికలు, పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఓడిపోయారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆల్‌ ఇండియా ఫార్వర్ట్‌ బ్లాక్‌ పార్టీ తరఫున ఆయన బరిలోకి దిగుతున్నారన్న ప్రచారం కూడా సాగింది. తెలంగాణలో ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ తరపున సీఎం అభ్యర్థి తీన్మార్‌ మల్లన్నే అని పార్టీ వర్గాలు సైతం ప్రకటించాయి. ఈ మేరకు మల్లన్నతో పార్టీ వర్గాలు చర్చలు కూడా జరిపాయి. తెలంగాణలోని మొత్తం 119 నియోజకవర్గాల్లో ఫార్వర్డ్‌ బ్లాక్‌ తరఫున పోటీ చేసేందుకు మల్లన్న టీంకు పార్టీ వర్గాలు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. ఇలా పొలిటికల్‌ సర్కిల్‌లో ప్రచారం జరగుతుండగానే.. ఆయన అనుహ్యంగా సీఎం అభ్యర్థిత్వాన్ని వదులుకొని కాంగ్రెస్‌ గూటికి చేరారు.

కాంగ్రెస్‌లో చేరిన తీన్మార్‌ మల్లన్న

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేల కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గెలుపే లక్ష్యంగా పార్టీలు వ్యూహాలకు పదునుపెడుతుంటే.. నేతలు కూడా తమకు కలిసొచ్చే పార్టీలోకి జంప్‌ చేస్తున్నారు.

తాజాగా.. బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం, కేసీఆర్‌ కుటుంబం పై ఎప్పటికప్పుడు దుమ్మెత్తి పోసిన చింత పండు నవీన్‌ అలియాస్‌ తీన్మార్‌ మల్లన్న బుధవారం ఉదయం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.
ఏఐసీసీ తెలంగాణ ఇంఛార్జ్‌ మానిక్‌ రావ్‌ ఠాక్రే, టీపీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో హస్తం గూటికి లోకి చేరారు.
గత కొంత కాలంగా ఆయన కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారనే ప్రచారం జరగ్గా.. ఆ ప్రచారానికి తెర దించుతూ ఆయన హస్తం గూటికి చేరారు.గతంలో బీజేపీ పార్టీలో చేరిన మల్లన్న.. అందులో నుంచి బయటకు వచ్చి అధికార పార్టీతో పాటు బీజేపీపై కూడా తనదైన శైలిలో విరుచుకుపడుతున్నారు.

కాంగ్రెస్‌ పార్టీ సపోర్ట్‌ చేస్తున్నట్టుగానే.. మల్లన్న తీరు ఉండటం ఆ పార్టీ నేతలతో సత్సంబంధాలు కొనసాగించటంతో హస్తం గూటికి చేరనున్నారనే ప్రచారం జోరుగా సాగింది. సోషల్‌ విూడియాను వేదికగా చేసుకొని కేసీఆర్‌ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో పోరాటం చేస్తున్న తీన్మార్‌ మల్లన్న.. జైలుకు కూడా వెళ్లి వచ్చారు.

గతంలో జరిగిన హుజూర్‌నగర్‌ ఉపఎన్నికలు, పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఓడిపోయారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆల్‌ ఇండియా ఫార్వర్ట్‌ బ్లాక్‌ పార్టీ తరఫున ఆయన బరిలోకి దిగుతున్నారన్న ప్రచారం కూడా సాగింది. తెలంగాణలో ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ తరపున సీఎం అభ్యర్థి తీన్మార్‌ మల్లన్నే అని పార్టీ వర్గాలు సైతం ప్రకటించాయి.

ఈ మేరకు మల్లన్నతో పార్టీ వర్గాలు చర్చలు కూడా జరిపాయి. తెలంగాణలోని మొత్తం 119 నియోజకవర్గాల్లో ఫార్వర్డ్‌ బ్లాక్‌ తరఫున పోటీ చేసేందుకు మల్లన్న టీంకు పార్టీ వర్గాలు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. ఇలా పొలిటికల్‌ సర్కిల్‌లో ప్రచారం జరగుతుండగానే.. ఆయన అనుహ్యంగా సీఎం అభ్యర్థిత్వాన్ని వదులుకొని కాంగ్రెస్‌ గూటికి చేరారు.

About The Author

Related Posts