ఎమ్మెల్సీ ఎన్నికలకు 15 నామినేషన్లు దాఖలు కరీంనగర్

కరీంనగర్, ఫిబ్రవరి 6(భారత శక్తి): మెదక్, నిజామాబాద్, కరీంనగర్,ఆదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలకు గురువారం 15 నామినేషన్లు దాఖలయ్యాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 12 మంది నామినేషన్ వేయగా, టీచర్స్ ఎమ్మెల్సీకి ముగ్గురు నామినేషన్లు దాఖలు చేశారు. అభ్యర్థుల నుండి ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి నామినేషన్లు స్వీకరించారు. ::పట్టభద్రుల స్థానం:: పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సంగారెడ్డి జిల్లా కంది మండలానికి చెందిన లంటు చంద్రశేఖర్ నామినేషన్ వేయగా, కరీంనగర్ లోని విద్యానగర్ కు చెందిన యాదగిరి శేఖర్ రావు తరఫున పచ్చునూరి సురేందర్ నామినేషన్ దాఖలు చేశారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతగూడ గ్రామానికి చెందిన మేకల అక్షయ్ కుమార్, నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం చిట్టాపూర్ కు చెందిన అబ్బగోని అశోక్ గౌడ్, నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పడగల్ గ్రామానికి చెందిన దేవతి శ్రీనివాస్, నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం పెరుందేవి గూడేనికి రైకల సైదులు, జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం గుండం పల్లికి చెందిన గుయ్య సాయి కృష్ణమూర్తి, కరీంనగర్ నగరానికి చెందిన ఎడ్ల సాయి కృష్ణప్రియ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి నామినేషన్లు దాఖలు చేశారు.సంగారెడ్డి జిల్లా సదాశివపేటకు చెందిన దొడ్ల వెంకటేశం, మంచిర్యాల జిల్లా తిరుమలగిరి కాలనీకి చెందిన కొమిరెడ్డి మహేష్, నిజామాబాద్ కు చెందిన గడ్డం శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం కొసునూరు పల్లికి చెందిన వేముల విక్రమ్ రెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ కి నామినేషన్ వేశారు. ::ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి:: మెదక్ జిల్లా టేకుమల్ మండలం ఎల్లుపేట గ్రామానికి చెందిన మామిడి సుధాకర్ రెడ్డి, సికింద్రాబాద్ ఈస్ట్ మారేడుపల్లికి చెందిన మల్కా కొమురయ్య, సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం న్యూ మల్కాపూర్ కు చెందిన వై. అశోక్ కుమార్ ఉపాధ్యాయుల ఎమ్మెల్సీకి నామినేషన్ దాఖలు చేశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి ఇదివరకే నామినేషన్ వేసిన ఆదిలాబాద్ జిల్లా యాపల్ గూడాకు చెందిన మంచి కట్ల ఆశమ్మ మరో రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. ఇదివరకే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి నామినేషన్ వేసిన మేడ్చల్ జిల్లా కీసర మండలం దమ్మాయిగూడేనికి చెందిన కంటే సాయన్న మరో సెట్ నామినేషన్ సమర్పించారు. ఉపాధ్యాయుల ఎమ్మెల్సీకి ఇదివరకే నామినేషన్ దాఖలు చేసిన కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన సిలివేరి శ్రీకాంత్ మరో సెట్ నామినేషన్ అందజేశారు. ఇప్పటివరకు పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలకు కలిపి మొత్తం 28 మంది నామినేషన్ దాఖలు చేశారు. ఇందులో 21 మంది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి, ఏడుగురు టీచర్స్ ఎమ్మెల్సీకి నామినేషన్ వేశారు.

ఎమ్మెల్సీ ఎన్నికలకు 15 నామినేషన్లు దాఖలు కరీంనగర్

కరీంనగర్, ఫిబ్రవరి 6(భారత శక్తి):
మెదక్, నిజామాబాద్, కరీంనగర్,ఆదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలకు గురువారం 15 నామినేషన్లు దాఖలయ్యాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 12 మంది నామినేషన్ వేయగా, టీచర్స్ ఎమ్మెల్సీకి ముగ్గురు నామినేషన్లు దాఖలు చేశారు. అభ్యర్థుల నుండి ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి నామినేషన్లు స్వీకరించారు.

::పట్టభద్రుల స్థానం::
పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సంగారెడ్డి జిల్లా కంది మండలానికి చెందిన లంటు చంద్రశేఖర్ నామినేషన్ వేయగా, కరీంనగర్ లోని విద్యానగర్ కు చెందిన యాదగిరి శేఖర్ రావు తరఫున పచ్చునూరి సురేందర్ నామినేషన్ దాఖలు చేశారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతగూడ గ్రామానికి చెందిన మేకల అక్షయ్ కుమార్, నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం చిట్టాపూర్ కు చెందిన అబ్బగోని అశోక్ గౌడ్, నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పడగల్ గ్రామానికి చెందిన దేవతి శ్రీనివాస్, నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం పెరుందేవి గూడేనికి రైకల సైదులు, జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం గుండం పల్లికి చెందిన గుయ్య సాయి కృష్ణమూర్తి, కరీంనగర్ నగరానికి చెందిన ఎడ్ల సాయి కృష్ణప్రియ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి నామినేషన్లు దాఖలు చేశారు.సంగారెడ్డి జిల్లా సదాశివపేటకు చెందిన దొడ్ల వెంకటేశం, మంచిర్యాల జిల్లా తిరుమలగిరి కాలనీకి చెందిన కొమిరెడ్డి మహేష్, నిజామాబాద్ కు చెందిన గడ్డం శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం కొసునూరు పల్లికి చెందిన వేముల విక్రమ్ రెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ కి నామినేషన్ వేశారు.

::ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి::

మెదక్ జిల్లా టేకుమల్ మండలం ఎల్లుపేట గ్రామానికి చెందిన మామిడి సుధాకర్ రెడ్డి, సికింద్రాబాద్ ఈస్ట్ మారేడుపల్లికి చెందిన మల్కా కొమురయ్య, సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం న్యూ మల్కాపూర్ కు చెందిన వై. అశోక్ కుమార్ ఉపాధ్యాయుల ఎమ్మెల్సీకి నామినేషన్ దాఖలు చేశారు.

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి ఇదివరకే నామినేషన్ వేసిన ఆదిలాబాద్ జిల్లా యాపల్ గూడాకు చెందిన మంచి కట్ల ఆశమ్మ మరో రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు.
ఇదివరకే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి నామినేషన్ వేసిన మేడ్చల్ జిల్లా కీసర మండలం దమ్మాయిగూడేనికి చెందిన కంటే సాయన్న మరో సెట్ నామినేషన్ సమర్పించారు.
ఉపాధ్యాయుల ఎమ్మెల్సీకి ఇదివరకే నామినేషన్ దాఖలు చేసిన కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన సిలివేరి శ్రీకాంత్ మరో సెట్ నామినేషన్ అందజేశారు. ఇప్పటివరకు పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలకు కలిపి మొత్తం 28 మంది నామినేషన్ దాఖలు చేశారు. ఇందులో 21 మంది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి, ఏడుగురు టీచర్స్ ఎమ్మెల్సీకి నామినేషన్ వేశారు.

About The Author

Related Posts