యువత క్రీడల్లో రాణించాలి: మధుయాష్కి గౌడ్
సరూర్ నగర్ స్టేడియంలో స్పోర్ట్స్ కిట్ల పంపిణీ
సరూర్ నగర్:
యువత వ్యసనాలకు దూరంగా ఉండి, క్రీడల్లో రాణించడం ద్వారా ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా 'మై భారత్' కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో యువ క్రీడాకారులకు క్రీడా సామాగ్రి (స్పోర్ట్స్ కిట్ల)ను ఉచితంగా పంపిణీ చేశారు.
మత్తుకు దూరం.. క్రీడలకు ప్రాధాన్యం
ఈ సందర్భంగా మధుయాష్కి గౌడ్ మాట్లాడుతూ, ప్రస్తుత సమాజంలో యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా ఉండాలంటే క్రీడలను అలవాటు చేసుకోవాలని సూచించారు. క్రీడలు కేవలం శారీరక దృఢత్వాన్ని మాత్రమే కాకుండా, మానసిక స్థైర్యాన్ని, క్రమశిక్షణను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం యువత సంక్షేమం, అభివృద్ధికి కట్టుబడి ఉందని, అందులో భాగంగానే ఇలాంటి ప్రోత్సాహక పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాలను యువత సద్వినియోగం చేసుకుని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జిల్లా పేరు నిలబెట్టాలని కోరారు.
కార్యక్రమంలో జిల్లా యువజన అధికారి ఐసయ్య, జిల్లా క్రీడాధికారి స్వర్ణలత, రామచంద్రరావు, గజ్జి భాస్కర్, బత్తుల వేణు, దాము మహేందర్ యాదవ్, సునీల్ బాబు, నరేష్ గుప్త, సాయి కిరణ్, అంతటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. క్రీడాకారులకు కిట్లను అందజేసిన అనంతరం వారితో కలిసి మధుయాష్కి గౌడ్ కాసేపు ముచ్చటించి వారిని ఉత్సాహపరిచారు.
.jpeg)
