తిమ్మపూర్‌లో ఉత్సాహంగా మే డే వేడుకలు
సిద్దిపేట:
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం తిమ్మపూర్ గ్రామంలో మే డే సందర్భంగా శుక్రవారం హమాలీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంఘం అధ్యక్షుడు ఉషి కనకరాజు జెండా ఎగరవేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కార్మికులు ఒకరికొకరు స్వీట్లు పంచుకుంటూ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సర్పంచ్ గుర్రాల శ్రీనివాస్ మాదిగ మాట్లాడుతూ, కార్మికుల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. కనీస వేతనం, భద్రత, సముచిత పని గంటలు వంటి ప్రాథమిక హక్కులు అందరికీ లభించాలన్నారు. కార్మిక చట్టాల రూపకర్త డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అని పేర్కొంటూ, శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా కార్మికులు ఐక్యంగా పోరాడాలని సూచించారు.కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, తమ హక్కుల కోసం చట్టబద్ధంగా పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు. అనంతరం గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు గ్రామానికి సేవలందిస్తున్న కార్మికులను శాలువాలతో సత్కరించి అభినందించారు.ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్, ఐకేపీ, పెయింటింగ్, హమాలీ కార్మికులతో పాటు గ్రామ పంచాయతీ సభ్యులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
