వేసవి సెలవుల్లో ఊరికి వెళ్తున్నారా... జర జాగ్రత్త

ఎల్బీనగర్:

ఈ వేసవి సెలవుల నేపథ్యంలో ప్రజలు స్వగ్రామాలకు, విహారయాత్రలకు వెళ్లే సమయంలో భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎల్బీనగర్ సీఐ వినోద్ కుమార్ సూచించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ సమయంలో ఖాళీ ఇండ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలు జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇంటికి తాళం వేసి వెళ్లేటప్పుడు నగదు, బంగారం, విలువైన వస్తువులను ఇంట్లో ఉంచవద్దని అన్నారు. బ్యాంక్ లాకర్లలో భద్రపరచడం మంచిదని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, మొబైల్ ఫోన్ లో కనెక్ట్ చేసుకోవాలన్నారు.
నమ్మకమైన పొరుగువారు, బంధువులకు సమాచారం ఇచ్చి ఇంటిపై నిఘా ఉంచాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్ 100 లేదా సమీప పోలీస్ స్టేషను సమాచారం ఇవ్వాలని సూచించారు.

పిల్లల భద్రతపై హెచ్చరిక..

చెరువులు, కుంటలు, కాలువల వద్ద ఈతకు వెళ్లడం ప్రమాదకరం లోతు తెలియని నీటిలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందనో పిల్లలను ఒంటరిగా నీటి ప్రాంతాలకు పంపకూడదు ఎప్పుడూ పెద్దల పర్యవేక్షణలోనే ఉండేలా చూడాలని పేర్కొన్నారు.

వేసవి జాగ్రత్తలు..

ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే సమయంలో బయటకు వెళ్లడం తగ్గించాలని తగినంత నీరు తీసుకోవాలని ప్రజలు అప్రమత్తంగా ఉంటేనే చోరీలు, ప్రమాదాలను నివారించవచ్చని సీఐ వినోద్ కుమార్ స్పష్టం చేశారు.

About The Author