కార్మిక సంక్షేమంలో ముందంజలో ఆర్బీఓఎల్

  • కలెక్టర్ చేతుల మీదుగా ఎండీ సరళ రెడ్డికి అవార్డు
  • సౌకర్యాల కల్పనలో ఆదర్శంగా నిలిచిన యాజమాన్యం.. జిల్లా కలెక్టర్ దీపక్ తివారి
  • కార్మికులే సంస్థకు బలమైన పునాది: ఎండి బుయ్యని సరళ రెడ్డి

కార్మిక సంక్షేమంలో ముందంజలో ఆర్బీఓఎల్

వికారాబాద్:

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మే డే (కార్మికుల దినోత్సవం) సందర్భంగా ఉత్తమ యాజమాన్యాలకు అందించే ప్రతిష్టాత్మక అవార్డును ఈసారి ఆర్బీఓఎల్ సంస్థ సొంతం చేసుకుంది. శుక్రవారంవికారాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన మేడే పురస్కారాల కార్యక్రమంలో ఆర్బీఓఎల్ ఎండి బుయ్యని సరళ రెడ్డి ఈ అవార్డును జిల్లా కలెక్టర్ దీపక్ తివారి చేతుల మీదుగా అందుకున్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దీపక్ తివారి మాట్లాడుతూ, కార్మికుల సంక్షేమాన్ని ముఖ్యంగా పరిగణిస్తూ వారి కనీస మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన ఆర్బీఓఎల్ యాజమాన్యం అభినందనీయం అన్నారు. కార్మికుల అభివృద్ధే సంస్థ అభివృద్ధికి పునాది అనే దృక్పథంతో పని చేస్తుండటం వల్లే ఈ అవార్డు దక్కిందని పేర్కొన్నారు.

అనంతరం ఆర్బీఓఎల్ ఎండి బుయ్యని సరళ రెడ్డి మాట్లాడుతూ, …
“ఒక సంస్థ విజయవంతంగా నడవాలంటే కార్మికులే ప్రధాన బలం. వారి సంక్షేమం చూసుకోవడం యాజమాన్యంగా మా బాధ్యత” అని అన్నారు. ఈ అవార్డును సంస్థలో పనిచేస్తున్న ప్రతి కార్మికుడికి అంకితం చేస్తున్నామని తెలిపారు.
కార్యక్రమం అనంతరం కార్మికులకు మే డే శుభాకాంక్షలు తెలియజేసి, వారిని సన్మానించి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్బీఓఎల్ సిబ్బంది, కలెక్టరేట్ అధికారులు, కార్మిక నాయకులు మరియు ఇతరులు పాల్గొన్నారు.
కార్మిక సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఆర్బీఓఎల్ – ఇతర సంస్థలకు ఆదర్శంగా నిలుస్తోందిWhatsApp Image 2026-05-01 at 19.32.28 (1)

About The Author