గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత: ఉద్యమకారుల అరెస్టు దురదృష్టకరం

హక్కులను కాలరాయడమే: జస్టిస్ చంద్రకుమార్

గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత: ఉద్యమకారుల అరెస్టు దురదృష్టకరం

హైదరాబాద్: 
 గాంధీభవన్ వద్ద భిక్షాటన చేస్తూ నిరసన తెలుపుతున్న తెలంగాణ ఉద్యమకారులను పోలీసులు అరెస్టు చేయడంపై జస్టిస్ చంద్రకుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికీ ఉంటుందని, అటువంటి వారిని నిర్బంధించడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

*హామీలు ఏమయ్యాయి?
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో తెలంగాణ ఉద్యమకారులకు అనేక హామీలు ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వాగ్దానాలను విస్మరించడం సరికాదన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఉద్యమకారులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.WhatsApp Image 2026-05-01 at 17.14.48 (1)

అరెస్టులపై ఖండన
 * శాంతియుత ప్రదర్శనలను అడ్డుకోవడం పౌర హక్కుల ఉల్లంఘనే అని ఆయన విమర్శించారు.
 * అరెస్టు చేసిన ఉద్యమకారులను వెంటనే విడుదల చేయాలని కోరారు.
 * ఉద్యమకారుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం చొరవ చూపాలని హితవు పలికారు.WhatsApp Image 2026-05-01 at 17.14.48

About The Author