మే డే స్ఫూర్తితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దోపిడీపై తిరుగుబాటు

కార్మికులంతా కలిసి పోరాటాలు చేయాలని ఏఐటియుసి పిలుపు

మే డే స్ఫూర్తితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దోపిడీపై తిరుగుబాటు

ఎల్బీనగర్:

మే డే సందర్బంగా సరూర్నగర్ మున్సిపల్ సర్కిల్ జోన్ ప్రధాన కార్యదర్శి ఎం.మద్దిలేటి మోహన్ నగర్ చౌరస్తా యూనియన్ బ్యాంక్ దగ్గర జెండా ఆవిష్కరించారు.ఆటో యూనియన్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నర్సిరెడ్డి కొత్తపేట చౌరస్తాలో, కర్మాన్ ఘాట్ చౌరస్తా, సరూర్నగర్ ఆర్ అండ్ రెడ్డి తదితర ప్రాంతాలలో జెండా ఆవిష్కరణలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలను కాలరాస్తూ కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా చట్టాలు మారుస్తూ, కార్మిక శక్తుల రక్త మాంసాలతో చెలగాటం ఆడుతున్నాయని నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుకుంటే ధరలకు అనుకూలంగా వేతనాలు ఇవ్వకుండా ఏళ్ల తరబడి పనిచేసినా పర్మెంటు లేదు, రిటైర్మెంట్ బెనిఫిట్ లేదు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్లకు ఫ్రీ బస్సు వలన ఎంతో నష్టం జరుగుతున్నా ప్రభుత్వం ఇస్తానన్న హామీ అమలు చేయకపోవడం శోచనీయకం అని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజలు ఎంతో ఐక్యత పోరాటానికి ముందుండాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మల్లేష్, లక్ష్మి, అందాల యాదయ్య, నరేందర్, ప్రమీల, కేశవ్, జయమ్మ, నరసింహ, అశోక్, శ్రీనివాస్, కృష్ణమూర్తి, కృష్ణ, కార్మికులు, తదితరులు పాల్గొన్నారు

About The Author