36 వ రహదారి భద్రతా మాసోత్సవాలు
తిరుపతి జిల్లా ప్రతినిధి, జనవరి 31, (భారత శక్తి) : 36 వ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా తిరుపతి నగరం లోని స్విమ్స్ హాస్పిటల్ సర్కిల్లో స్థానిక జిల్లా రవాణా శాఖ అధికారి కొర్రపాటి మురళీమోహన్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బాలకృష్ణ నాయక్, మోటార్ వాహనాల తనిఖీ అధికారి శ్రీమతి అతికానాజ్ మరియు రహదారి భద్రతా విభాగ వైద్యురాలు డాక్టర్ పూజ వాణి ఉపాధ్యాయ గుడ్ సమారిటన్ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. రహదారి ప్రమాదాలు జరిగినప్పుడు క్షతగాత్రులని తక్షణమే వైద్యశాలకు తరలించే ప్రక్రియలో సహాయపడే ఒక మంచి సమారిటన్ ను గుర్తించి వారికి ప్రోత్సాహకంగా బహుమతి రూపంలో 5000 రూపాయలు నగదు మరియు ప్రశంసా పత్రం ఇవ్వబడునని ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి తెలియజేశారు. రహదారి లో ప్రమాదం జరిగినప్పుడు క్షతగాత్రుని తరలించే అంశంలో సహాయపడిన వ్యక్తికి పోలీస్ నుంచి మరియు న్యాయస్థానం నుంచి సరైన రక్షణ ఉంటుందని మోటరోహణ చట్టం 1988 లోని సెక్షన్ 134 A, మరియు సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ 168 & 169 ల ద్వారా చట్టబద్ధమైన రక్షణ కల్పించబడిందని మోటార్ వాహనాలు తనిఖీ అధికారి శ్రీమతి అతికా నాజ్ తెలియజేశారు. ఈ చట్టం ప్రకారం క్షతగాత్రులకు సాయం చేసిన వ్యక్తి యొక్క వివరాలు తెలపవలసిన నిర్దిష్ట అవసరం లేదని కూడా తెలియజేశారు. వైద్యురాలు పూజ వాణి జయరాం మాట్లాడుతూ రోడ్డు ప్రమాదం జరిగిన మొదటి గంట అంటే గోల్డ్ అవర్ లోపు బాధితులకి సరైన వైద్య చికిత్స అందితే ప్రాణాలు కాపాడవచ్చని అందువలన ఈ గుడ్ సమారిటన్ చట్టం ఉపయోగపడుతుందని తెలియజేశారు. పాత మెటర్నిటీ ఆసుపత్రి నుండి సిమ్స్ హాస్పిటల్ వరకు జిల్లా ప్రధాన వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయ సిబ్బంది తో ప్రచార ర్యాలీ నిర్వహించారు.
తిరుపతి జిల్లా ప్రతినిధి, జనవరి 31, (భారత శక్తి) : 36 వ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా తిరుపతి నగరం లోని స్విమ్స్ హాస్పిటల్ సర్కిల్లో స్థానిక జిల్లా రవాణా శాఖ అధికారి కొర్రపాటి మురళీమోహన్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బాలకృష్ణ నాయక్, మోటార్ వాహనాల తనిఖీ అధికారి శ్రీమతి అతికానాజ్ మరియు రహదారి భద్రతా విభాగ వైద్యురాలు డాక్టర్ పూజ వాణి ఉపాధ్యాయ గుడ్ సమారిటన్ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు.
రహదారి ప్రమాదాలు జరిగినప్పుడు క్షతగాత్రులని తక్షణమే వైద్యశాలకు తరలించే ప్రక్రియలో సహాయపడే ఒక మంచి సమారిటన్ ను గుర్తించి వారికి ప్రోత్సాహకంగా బహుమతి రూపంలో 5000 రూపాయలు నగదు మరియు ప్రశంసా పత్రం ఇవ్వబడునని ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి తెలియజేశారు. రహదారి లో ప్రమాదం జరిగినప్పుడు క్షతగాత్రుని తరలించే అంశంలో సహాయపడిన వ్యక్తికి పోలీస్ నుంచి మరియు న్యాయస్థానం నుంచి సరైన రక్షణ ఉంటుందని మోటరోహణ చట్టం 1988 లోని సెక్షన్ 134 A, మరియు సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ 168 & 169 ల ద్వారా చట్టబద్ధమైన రక్షణ కల్పించబడిందని మోటార్ వాహనాలు తనిఖీ అధికారి శ్రీమతి అతికా నాజ్ తెలియజేశారు.
ఈ చట్టం ప్రకారం క్షతగాత్రులకు సాయం చేసిన వ్యక్తి యొక్క వివరాలు తెలపవలసిన నిర్దిష్ట అవసరం లేదని కూడా తెలియజేశారు.
వైద్యురాలు పూజ వాణి జయరాం మాట్లాడుతూ రోడ్డు ప్రమాదం జరిగిన మొదటి గంట అంటే గోల్డ్ అవర్ లోపు బాధితులకి సరైన వైద్య చికిత్స అందితే ప్రాణాలు కాపాడవచ్చని అందువలన ఈ గుడ్ సమారిటన్ చట్టం ఉపయోగపడుతుందని తెలియజేశారు. పాత మెటర్నిటీ ఆసుపత్రి నుండి సిమ్స్ హాస్పిటల్ వరకు జిల్లా ప్రధాన వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయ సిబ్బంది తో ప్రచార ర్యాలీ నిర్వహించారు.
