ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి

జాతీయ ఎస్సీ ఎస్టీ హబ్ అధికారి ఎస్ సురేష్

వైయస్సార్ కడప జిల్లా జూలై 31: ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు అవకాశాలను అందిపుచ్చుకొని సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని జాతీయ ఎస్సీ ఎస్టీ హబ్ అధికారి ఎస్. సురేష్ అన్నారు. స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో కేంద్ర ప్రభుత్వ ఎంఎస్ఎన్ఈ మంత్రిత్వ శాఖ, జాతీయ ఎస్సీ ఎస్టీ హబ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ మహిళ పారిశ్రామికవేత్తలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు
1000430426
ఈ సందర్భంగా జాతీయ ఎస్సీ ఎస్టీ హబ్ అధికారి ఎస్.సురేష్ మాట్లాడుతూ.... కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు వినియోగించుకోవాలని కోరారు. ఎంఎస్ ఎంఈ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఎస్సీ ఎస్టీ యూనిట్లు అన్ని రీయింబర్స్‌మెంట్ పథకాలలో నమోదు చేసుకొని లబ్ధి పొందాలని సూచించారు. ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రుణాలు ప్రయోజనాలను పొందేందుకు పూర్తి మద్దతు ఇవ్వడానికి బ్యాంకులు పారిశ్రామిక సంస్థలు ముందుకు రావాలన్నారు. అలాగే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో ఇంట్రాక్షన్ జరిపి వారి సందేహాలను నివృత్తి చేశారు. ఆంధ్ర తెలంగాణలలో అన్ని జిల్లాల వ్యాపార సంఘాలు ఎస్సీ కార్పొరేషన్ బ్యాంకర్లతో మరియు ప్రభుత్వ ఏజెన్సీలతో ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి పలు కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు.75 కంటే ఎక్కువ ఎస్సీ ఎస్టీ ఎం ఎస్ ఎం ఈ అవగాహన సదస్సులలో పాల్గొని ఎస్సీ ఎస్టీ మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు.
 
ఈ కార్యక్రమంలో లీడ్ బ్యాంకు మేనేజర్ జనార్ధన, పరిశ్రమల శాఖ జిఎం చాంద్ బాషా, ఏపీఐఐసీ జెడ్ ఏం శ్రీనివాసమూర్తి, జాతీయ ఎస్సీ ఎస్టీ హబ్ సభ్యులు వసంత్,యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

About The Author