జిల్లాలో గ్రామాలు, పట్టణాలను స్వచ్ఛతకు ప్రతీకలుగా తీర్చిదిద్దాలి: జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి

కడప, ఫిబ్రవరి 14(భారత శక్తి ) : స్వర్ణాంధ్ర, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ సాధనలో భాగంగా జిల్లాలోని గ్రామాలు, పట్టణాలను స్వచ్ఛతకు ప్రతీకలుగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ లోని బోర్డు మీటింగ్ హాలులో స్వర్ణాంధ్ర, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ సాధనలో భాగంగా ప్రతి నెలా 3వ శనివారం చేపట్టే “స్వచ్ఛ దివస్” కార్యాచరణపై జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు, ఎంపిడివోలు, పంచాయతీ అధికారులకు జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి విసి ద్వారా పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి నెల మూడవ శనివారాన్ని స్వచ్ఛ ఆంధ్రా దివస్ గా నిర్ణయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన మేరకు ఈ నెల మూడవ శనివారం (15వ తేదీ) నాడు అన్ని గ్రామాలు, పట్టణాల్లోని వీధుల్లో, ఇళ్లలో “స్వచ్ఛ దివస్” కార్యక్రమాన్ని విధిగా, బాధ్యతగా నిర్వహించాలన్నారు. స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా.. దీర్ఘకాలంగా పేరుకుపోయిన చెత్తను, డంపింగ్ యార్డులను పూర్తిగా తొలగించే చర్యలు చేపట్టాలన్నారు. చెత్త కాగితాలు, వ్యర్థ పదార్థాలు, ప్లాస్టిక్ కాగితలను సంపూర్తిగా తొలగించాలన్నారు. ఈ స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని.. అత్యంత ప్రధాన్యతతో ప్రత్యేకంగా చేపడుతూనే దైనందిన రోజువారీ క్లినింగ్ కార్యక్రమాన్ని నిరంతరాయంగా కొనసాగించాలన్నారు. వచ్చే నెల స్వచ్ఛ దివస్ కార్యక్రమంలోగా జిల్లాను స్వచ్ఛ జిల్లాగా మార్చాలన్నారు. తేదీ చెత్త పొడిచెత్తను వేరు చేసే గ్రీన్, బ్లూ రంగుల ట్విన్ బిన్ పద్ధతిని ఉపయోగించాలన్నారు. ఐవిఆర్ఎస్ సిస్టమ్ ద్వారా గ్రామాల్లో, పట్టణాల్లో ఇంటింటా చెత్త సేకరణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఇంటి నుండి సేకరించే వ్యర్థాల నుండి హోం కంపోస్టును తయారు చేసి ఇళ్లలోనే కిచెన్ గార్డెన్, హోమ్ గార్డెన్ ద్వారా మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించాలన్నారు. వ్యర్థాల సెగ్రిగేషన్, ట్విన్ బిన్ సిస్టమ్, డంప్ సైక్లింగ్ పై అవగాహన పెంచే ర్యాలీలు, ఇతర అవగాహన కార్యక్రమాలను ఉదయం 7 గంటల నుండే ప్రారంభించాలన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇళ్లతో పాటు అన్ని రకాల కార్యాలయాలలో ఆయా కార్యాలయ సిబ్బంది స్వచ్చందంగా క్లిన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. గ్రామాలు, వార్డుల్లోని వీధుల్లో ఉత్పన్నమయ్యే చెత్తను సేకరించే కార్యక్రమంలో కేవలం హరిత రాయబారులు (గ్రీన్ అంబాసిడర్లు) మాత్రమే కాకుండా ప్రజలు కూడా పూర్తిస్థాయి భాగస్వామ్యం చేయాలన్నారు. అలాగే ఎన్జీవోలు, అన్ని శాఖల ఉద్యోగులు భాగస్వామ్యాన్ని కూడా ప్రోత్సహించాలన్నారు. మంచి ఆలోచనలు, ఆరోగ్యవంతమైన శరీరం, స్వచ్ఛమైన వాతావరణం, ఇంటి దగ్గర, పనిచేసే చోట పరిశుభ్రతలతో మన గ్రామాన్ని, మన పట్టణాన్ని స్వచ్ఛతకు ప్రతీకలుగా తీర్చిదిద్దాలన్నారు. అపుడే మన జిల్లాను స్వచ్ఛ జిల్లాగా, రాష్ట్రాన్ని స్వర్ణ ఆంధ్రగా, స్వచ్ఛ ఆంధ్రగా సాధించుకోగలమన్నారు. ఆ మేరకు స్వచ్ఛత వైపు ఒక ముందడుగు గేద్దామని పంచాయతీ, మున్సిపాలిటీ అధికారులు, సిబ్బంది, ప్రజలకు జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. “స్వచ్చ దివస్” లో భాగంగా ప్రతి పౌరుడు మూడవ శనివారాన్ని స్వచ్ఛ ఆంధ్రగా పాటించి ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దాం అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పి సీఈవో ఓబులమ్మ, డిపివో రాజ్యలక్ష్మి, డిఆర్డీఏ, మెప్మా పీడీలు ఆనంద్ నాయక్, కిరణ్ కుమార్ లు పాల్గొన్నారు.

జిల్లాలో గ్రామాలు, పట్టణాలను స్వచ్ఛతకు ప్రతీకలుగా తీర్చిదిద్దాలి: జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి

కడప, ఫిబ్రవరి 14(భారత శక్తి ) : స్వర్ణాంధ్ర, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ సాధనలో భాగంగా జిల్లాలోని గ్రామాలు, పట్టణాలను స్వచ్ఛతకు ప్రతీకలుగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు.

శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ లోని బోర్డు మీటింగ్ హాలులో స్వర్ణాంధ్ర, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ సాధనలో భాగంగా ప్రతి నెలా 3వ శనివారం చేపట్టే “స్వచ్ఛ దివస్” కార్యాచరణపై జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు, ఎంపిడివోలు, పంచాయతీ అధికారులకు జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి విసి ద్వారా పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.

ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి నెల మూడవ శనివారాన్ని స్వచ్ఛ ఆంధ్రా దివస్ గా నిర్ణయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన మేరకు ఈ నెల మూడవ శనివారం (15వ తేదీ) నాడు అన్ని గ్రామాలు, పట్టణాల్లోని వీధుల్లో, ఇళ్లలో “స్వచ్ఛ దివస్” కార్యక్రమాన్ని విధిగా, బాధ్యతగా నిర్వహించాలన్నారు.

స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా.. దీర్ఘకాలంగా పేరుకుపోయిన చెత్తను, డంపింగ్ యార్డులను పూర్తిగా తొలగించే చర్యలు చేపట్టాలన్నారు. చెత్త కాగితాలు, వ్యర్థ పదార్థాలు, ప్లాస్టిక్ కాగితలను సంపూర్తిగా తొలగించాలన్నారు. ఈ స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని.. అత్యంత ప్రధాన్యతతో ప్రత్యేకంగా చేపడుతూనే దైనందిన రోజువారీ క్లినింగ్ కార్యక్రమాన్ని నిరంతరాయంగా కొనసాగించాలన్నారు. వచ్చే నెల స్వచ్ఛ దివస్ కార్యక్రమంలోగా జిల్లాను స్వచ్ఛ జిల్లాగా మార్చాలన్నారు. తేదీ చెత్త పొడిచెత్తను వేరు చేసే గ్రీన్, బ్లూ రంగుల ట్విన్ బిన్ పద్ధతిని ఉపయోగించాలన్నారు. ఐవిఆర్ఎస్ సిస్టమ్ ద్వారా గ్రామాల్లో, పట్టణాల్లో ఇంటింటా చెత్త సేకరణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలన్నారు.

ఇంటి నుండి సేకరించే వ్యర్థాల నుండి హోం కంపోస్టును తయారు చేసి ఇళ్లలోనే కిచెన్ గార్డెన్, హోమ్ గార్డెన్ ద్వారా మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించాలన్నారు. వ్యర్థాల సెగ్రిగేషన్, ట్విన్ బిన్ సిస్టమ్, డంప్ సైక్లింగ్ పై అవగాహన పెంచే ర్యాలీలు, ఇతర అవగాహన కార్యక్రమాలను ఉదయం 7 గంటల నుండే ప్రారంభించాలన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఇళ్లతో పాటు అన్ని రకాల కార్యాలయాలలో ఆయా కార్యాలయ సిబ్బంది స్వచ్చందంగా క్లిన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. గ్రామాలు, వార్డుల్లోని వీధుల్లో ఉత్పన్నమయ్యే చెత్తను సేకరించే కార్యక్రమంలో కేవలం హరిత రాయబారులు (గ్రీన్ అంబాసిడర్లు) మాత్రమే కాకుండా ప్రజలు కూడా పూర్తిస్థాయి భాగస్వామ్యం చేయాలన్నారు. అలాగే ఎన్జీవోలు, అన్ని శాఖల ఉద్యోగులు భాగస్వామ్యాన్ని కూడా ప్రోత్సహించాలన్నారు.

మంచి ఆలోచనలు, ఆరోగ్యవంతమైన శరీరం, స్వచ్ఛమైన వాతావరణం, ఇంటి దగ్గర, పనిచేసే చోట పరిశుభ్రతలతో మన గ్రామాన్ని, మన పట్టణాన్ని స్వచ్ఛతకు ప్రతీకలుగా తీర్చిదిద్దాలన్నారు. అపుడే మన జిల్లాను స్వచ్ఛ జిల్లాగా, రాష్ట్రాన్ని స్వర్ణ ఆంధ్రగా, స్వచ్ఛ ఆంధ్రగా సాధించుకోగలమన్నారు. ఆ మేరకు స్వచ్ఛత వైపు ఒక ముందడుగు గేద్దామని పంచాయతీ, మున్సిపాలిటీ అధికారులు, సిబ్బంది, ప్రజలకు జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. “స్వచ్చ దివస్” లో భాగంగా ప్రతి పౌరుడు మూడవ శనివారాన్ని స్వచ్ఛ ఆంధ్రగా పాటించి ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దాం అన్నారు.
ఈ కార్యక్రమంలో జెడ్పి సీఈవో ఓబులమ్మ, డిపివో రాజ్యలక్ష్మి, డిఆర్డీఏ, మెప్మా పీడీలు ఆనంద్ నాయక్, కిరణ్ కుమార్ లు పాల్గొన్నారు.

About The Author

Related Posts