న్యాయవాది మల్లారెడ్డి మర్డర్ కు రూ:18 లక్షల డీల్
10 మంది అరెస్ట్ మరో ఐదుగురు పరారీలో రెక్కీ నిర్వహించి అంతమొందించిన ములుగు పోలీసులు ములుగు బ్యూరో,ఆగస్టు 8(భారత శక్తి): న్యాయవాది మూలగుండ్ల మల్లారెడ్డి హత్య కేసును పోలీసులు ఎట్టకేలకు చేదించారు.ఆగస్టు 1న సోమవారం రాత్రి ములుగు మండలం పందికుంట క్రాస్ సమీపంలో జాతీయ రహదారి పక్కన హత్య జరిగిన విషయం తెలిసిందే, ఈనెల 5న రాత్రి నలుగురిని అరెస్టు చూపిన పోలీసులు ఆదివారం మరో ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్లు ప్రకటించారు. జిల్లా ఎస్పీ సంగ్రాం సింగ్ జీ పాటిల్ ములుగులోని పోలీస్ ఎ.ఆర్ హెడ్ క్వార్టర్స్ లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన గోనెల రవీందర్, హనుమకొండకు చెందిన పిండి రవి యాదవ్, ములుగు మండలం కోడిశెలకుంటకు చెందిన వంచ రామ్మోహన్ రెడ్డి, హత్యకు సూత్రధారులు. పథకాన్ని అమలు చేయడానికి వరంగల్ జిల్లా నారక్క పేటకు చెందిన తడక రమేష్ సహకరించాడు. ఈ నలుగురిని ఈనెల ఐదున అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కు తరలించారు. మిగిలిన వారిలో అనుమకొండ జిల్లా గంగిరేణిగూడానికి చెందిన పెరమాండ్ల రాజు (ఏ6), పెరమాండ్ల రాకేష్ (ఏ14), వరంగల్ జిల్లా నారక్కపేటకు చెందిన వైనాల శివ (ఏ 11), ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా కొక్కెరంచేకు చెందిన ఈడిగ వేణు(ఏ12), ఈడిగా జయరాం (ఏ8), నంద్యాల జిల్లా పాములపాడుకు చెందిన బుక్క వెంకటరమణ (ఏ9), లకు హత్యతో సంబంధాలు ఉన్నాయని నిర్ధారించి అరెస్టు చేశారు. హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్న ఆరుగురు నిందితుల్లో ఇద్దరు మల్లారెడ్డి కదిలికలపై నిఘాపెట్టగా మిగిలిన నలుగురు పందికుంట స్టేజి వద్ద వేచి ఉన్నారు. న్యాయవాది ప్రయాణించిన కారు స్పీడ్ బ్రేకర్ వల్ల వేగం తగ్గించడంతో నిందితులు వెనుక నుంచి మరో కారుతో ఢీకొట్టారు ఆయన కారు దిగి పరిశీలిస్తుండగా అక్కడే మాటు వేసి ఉన్న నలుగురు చెట్లపొదల్లోకి లాక్కెళ్లి కత్తులతో పొడిచి చంపారు. చనిపోయినట్లు నిర్ధారించుకున్నాకే అక్కడనుండి పరారయ్యారు. గంగిరేణి గూడెం వాసి పెరమండ్ల రాజు ఈ నేరానికి ప్రధాన కార్యనిర్వాహకుడు, రాజుకు బంధువు అయినా తడక రమేష్ 2020 సంవత్సరం లో హత్య గురించి అతనితో చర్చించాడు. హత్య చేయడానికి ఇరువర్గాల మధ్య రూ:18 లక్షలకు ఒప్పందం కుదిరింది. రాజు కర్నూలు జిల్లాకు చెందిన జయరాం, వేణు, నంద్యాల జిల్లా పాములపాడుకు చెందిన వెంకటరమణ, నారక్క పేటకు చెందిన శివను ఒప్పించి రవీందర్ నుంచి అడ్వాన్స్ తీసుకున్నారు. హత్యకు సంబంధించి ఇంకా కొంతమంది నిందితులున్నారని ఎస్పీ తెలిపారు.వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. కేసును నిష్పక్షపాతంగా సారైనా పద్దతిలో పరిశోధన చేసేందుకు ములుగు ఏఎఎస్పీ సుధీర్ రామనాధ్ కేకాన్ ను కేసు పరిశోధన అధికారిగా నియమించామని అన్నారు. కేసును చేదించడంలో కృషిచేసిన ఓఎస్డి గౌస్ ఆలం, ఏ ఎస్పీ సుధీర్ ఆర్.కెకాన్, డీఎస్పీ దేవెందరెడ్డి,సి. ఐ శ్రీదర్, ఎస్సై ఓంకార్ యాదవ్.ఆర్ ఐ స్వామీలను ఎస్పీ అభినందించారు.
10 మంది అరెస్ట్ మరో ఐదుగురు పరారీలో
రెక్కీ నిర్వహించి అంతమొందించిన
ములుగు పోలీసులు
ములుగు బ్యూరో,ఆగస్టు 8(భారత శక్తి): న్యాయవాది మూలగుండ్ల మల్లారెడ్డి హత్య కేసును పోలీసులు ఎట్టకేలకు చేదించారు.ఆగస్టు 1న సోమవారం రాత్రి ములుగు మండలం పందికుంట క్రాస్ సమీపంలో జాతీయ రహదారి పక్కన హత్య జరిగిన విషయం తెలిసిందే, ఈనెల 5న రాత్రి నలుగురిని అరెస్టు చూపిన పోలీసులు ఆదివారం మరో ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్లు ప్రకటించారు. జిల్లా ఎస్పీ సంగ్రాం సింగ్ జీ పాటిల్ ములుగులోని పోలీస్ ఎ.ఆర్ హెడ్ క్వార్టర్స్ లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన గోనెల రవీందర్, హనుమకొండకు చెందిన పిండి రవి యాదవ్, ములుగు మండలం కోడిశెలకుంటకు చెందిన వంచ రామ్మోహన్ రెడ్డి, హత్యకు సూత్రధారులు. పథకాన్ని అమలు చేయడానికి వరంగల్ జిల్లా నారక్క పేటకు చెందిన తడక రమేష్ సహకరించాడు. ఈ నలుగురిని ఈనెల ఐదున అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కు తరలించారు. మిగిలిన వారిలో అనుమకొండ జిల్లా గంగిరేణిగూడానికి చెందిన పెరమాండ్ల రాజు (ఏ6), పెరమాండ్ల రాకేష్ (ఏ14), వరంగల్ జిల్లా నారక్కపేటకు చెందిన వైనాల శివ (ఏ 11), ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా కొక్కెరంచేకు చెందిన ఈడిగ వేణు(ఏ12), ఈడిగా జయరాం (ఏ8), నంద్యాల జిల్లా పాములపాడుకు చెందిన బుక్క వెంకటరమణ (ఏ9), లకు హత్యతో సంబంధాలు ఉన్నాయని నిర్ధారించి అరెస్టు చేశారు. హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్న ఆరుగురు నిందితుల్లో ఇద్దరు మల్లారెడ్డి కదిలికలపై నిఘాపెట్టగా మిగిలిన నలుగురు పందికుంట స్టేజి వద్ద వేచి ఉన్నారు. న్యాయవాది ప్రయాణించిన కారు స్పీడ్ బ్రేకర్ వల్ల వేగం తగ్గించడంతో నిందితులు వెనుక నుంచి మరో కారుతో ఢీకొట్టారు ఆయన కారు దిగి పరిశీలిస్తుండగా అక్కడే మాటు వేసి ఉన్న నలుగురు చెట్లపొదల్లోకి లాక్కెళ్లి కత్తులతో పొడిచి చంపారు. చనిపోయినట్లు నిర్ధారించుకున్నాకే అక్కడనుండి పరారయ్యారు.
