విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటనలో ప్రధానోపాధ్యాయునితో పాటు ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్: జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.

భారత శక్తి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో షేక్ అహ్మద్, ఫిబ్రవరి 03:నిర్మల్ జిల్లా నర్సాపూర్ జి. విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటనలో నర్సాపూర్ జి పాఠశాలకు చెందిన ప్రధానోపాధ్యాయునితో పాటు ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు ఫిర్యాదులు రావడంతో నర్సాపూర్ (జి) ప్రభుత్వ పాఠశాలకు చెందిన ప్రధానోపాధ్యాయుడు ఏం కిషన్ రావు (పీజీహెచ్ఎం) సహ ఇద్దరు ఉపాధ్యాయులు ఎ.మనోహర్ రెడ్డి ఎస్ ఏ (మ్యాథ్స్). ఎస్ మోహన్ రావు(ఇంగ్లీష్) ముగ్గురిని విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై శాఖా పరమైన విచారణ కొనసాగుతుందని, ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. కాగా ఈ ఘటనపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతమైతే తీవ్ర పరిణామాలు ఉంటాయని కలెక్టర్ హెచ్చరించారు.

విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటనలో ప్రధానోపాధ్యాయునితో పాటు ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్: జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.

భారత శక్తి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో షేక్ అహ్మద్, ఫిబ్రవరి 03:నిర్మల్ జిల్లా నర్సాపూర్ జి. విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటనలో నర్సాపూర్ జి పాఠశాలకు చెందిన ప్రధానోపాధ్యాయునితో పాటు ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు ఫిర్యాదులు రావడంతో నర్సాపూర్ (జి) ప్రభుత్వ పాఠశాలకు చెందిన ప్రధానోపాధ్యాయుడు
ఏం కిషన్ రావు (పీజీహెచ్ఎం)
సహ ఇద్దరు ఉపాధ్యాయులు ఎ.మనోహర్ రెడ్డి ఎస్ ఏ (మ్యాథ్స్). ఎస్ మోహన్ రావు(ఇంగ్లీష్) ముగ్గురిని విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై శాఖా పరమైన విచారణ కొనసాగుతుందని, ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. కాగా ఈ ఘటనపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతమైతే తీవ్ర పరిణామాలు ఉంటాయని కలెక్టర్ హెచ్చరించారు.

About The Author

Related Posts