ఆరు చుక్కలతో అంధుల కోసం ప్రత్యేక లిపి అంధులకి బ్రెయిల్ లిపి వెలుగు రేఖ
సూర్యాపేట జిల్లా బ్యూరో (భారత శక్తి) : ఆరు చుక్కలతో అందుల కోసం ప్రత్యేక లిపిని కనిపెట్టి అందుల జీవితాల్లలో వెలుగులు నింపిన మహానుభావుడు లూయిస్ బ్రెయిల్ అని జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు అన్నారు. శనివారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరం లో లూయిస్ బ్రెయిల్ 216 వ జన్మదిన వేడుకల లో జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు పాల్గొని జ్యోతి ప్రజ్వలాన చేసి చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ చీకట్లో లాంతరు లేకుండా మనం నడవాలంటే భయం భయం గా ఒక్కోక్క అడుగు వేస్తూ నడుస్తాం కానీ అంధులు నిత్యం చీకటి తోనే గడుపుతారని అలాంటి వారి ఆశలను, ఆశయాలను తీర్చుటకు ప్రపంచాన్ని జయించుటకు ఒక్క లిపి ఉండాలని తపించి బ్రెయిల్ లిపిని కనిపెట్టిన మహనీయుడు లూయిస్ బ్రెయిల్ అని తెలిపారు.ఆరు చుక్కలతోనే ప్రపంచం లోని అన్ని భాషలు నేర్చుకునేవిధంగా బ్రెయిల్ లిపిని తీర్చిదిద్దటం లూయిస్ బ్రెయిల్ కి మాత్రమే సాధ్యం అయిందని అన్నారు.ఇటీవల జరిగిన అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో అంధుల కోసం బ్రెయిల్ లిపి లో ఈ వి యం ద్వారా ఓటు వేసే హక్కు కల్పించి ప్రజాప్రతినిధులను ఎన్నుకునే అవకాశం కల్పించటం జరిగిందని తెలిపారు. దురదృష్టవశాత్తు పుట్టుకతోగానీ, అనుకోని సంఘటనల వల్ల అంధత్వం రావటం చాలా బాధాకరమని అంధత్వం ఉందని మనో ధైర్యాన్ని కోల్పోకుండా సమాజం లో తక్కువ అనే భావన లేకుండా ధైర్యంగా ఉంటూ పది మందికి ఉపాధి కల్పించే స్థాయి కి ఎదగాలని ఆకాక్షించారు.అంధత్వం ఉన్నప్పటికీ పలువురు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించటం అలాగే వివిధ రంగాలలో ఉన్నత స్థాయి కి ఎదగటం చాలా అభినందనీయమని తెలిపారు.అంధత్వం లోపం కాదని ఉత్తమ ప్రతిభ చూపెట్టిన పలువురు ఉద్యోగులను జిల్లా అదనపు కలెక్టర్ సన్మానించారు.కుడకుడ యం పి పి ఎస్ కి చెందిన ఉపాధ్యాయుడు రవీందర్ మాట్లాడుతూ అంధులు విలువలతో ఒక్కరి మీద ఆధారపడకుండ స్వతంత్రంగా బ్రతకాలని అప్పుడు సమాజం మానవతా దృక్పధం తో సహాయం చేస్తారని తెలిపారు. జిల్లా బ్లైండ్ అసోసియేషన్ అధ్యక్షులు ఐలాపురం యం పి పి ఎస్ స్కూల్ టీచర్ సోమయ్య మాట్లాడుతూ పట్టుదల తో ఏదైన సాధించవచ్చని, పెన్ పహాడ్ ఉన్నత పాఠశాల జూనియర్ అసిస్టెంట్ వెంకటయ్య అంధుల గొప్పతనం గురించి పాట పాడి ఉత్సాహ పరిచారు.ఇమంపేట మోడల్ స్కూల్ గణితం మాస్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ అంధులు అన్ని అవకాశలు ఉపయోగించుకుంటూనారని ప్రస్తుతం సాప్ట్ వేర్ జాబ్ లలో కూడా రాణిస్తున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి నరసింహరావు, జిల్లా ఎస్ సి సంక్షేమ అధికారి లత, మెప్మా పి డి రేణుక , జిల్లా శిశు, మహిళా,వికలాంగుల సంక్షేమ శాఖ ఉద్యోగులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సూర్యాపేట జిల్లా బ్యూరో (భారత శక్తి) :
ఆరు చుక్కలతో అందుల కోసం ప్రత్యేక లిపిని కనిపెట్టి అందుల జీవితాల్లలో వెలుగులు నింపిన మహానుభావుడు లూయిస్ బ్రెయిల్ అని జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు అన్నారు. శనివారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరం లో లూయిస్ బ్రెయిల్ 216 వ జన్మదిన వేడుకల లో జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు పాల్గొని జ్యోతి ప్రజ్వలాన చేసి చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ చీకట్లో లాంతరు లేకుండా మనం నడవాలంటే భయం భయం గా ఒక్కోక్క అడుగు వేస్తూ నడుస్తాం కానీ అంధులు నిత్యం చీకటి తోనే గడుపుతారని అలాంటి వారి ఆశలను, ఆశయాలను తీర్చుటకు ప్రపంచాన్ని జయించుటకు ఒక్క లిపి ఉండాలని తపించి బ్రెయిల్ లిపిని కనిపెట్టిన మహనీయుడు లూయిస్ బ్రెయిల్ అని తెలిపారు.ఆరు చుక్కలతోనే ప్రపంచం లోని అన్ని భాషలు నేర్చుకునేవిధంగా బ్రెయిల్ లిపిని తీర్చిదిద్దటం లూయిస్ బ్రెయిల్ కి మాత్రమే సాధ్యం అయిందని అన్నారు.ఇటీవల జరిగిన అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో అంధుల కోసం బ్రెయిల్ లిపి లో ఈ వి యం ద్వారా ఓటు వేసే హక్కు కల్పించి ప్రజాప్రతినిధులను ఎన్నుకునే అవకాశం కల్పించటం జరిగిందని తెలిపారు. దురదృష్టవశాత్తు పుట్టుకతోగానీ, అనుకోని సంఘటనల వల్ల అంధత్వం రావటం చాలా బాధాకరమని అంధత్వం ఉందని మనో ధైర్యాన్ని కోల్పోకుండా సమాజం లో తక్కువ అనే భావన లేకుండా ధైర్యంగా ఉంటూ పది మందికి ఉపాధి కల్పించే స్థాయి కి ఎదగాలని ఆకాక్షించారు.అంధత్వం ఉన్నప్పటికీ పలువురు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించటం అలాగే వివిధ రంగాలలో ఉన్నత స్థాయి కి ఎదగటం చాలా అభినందనీయమని తెలిపారు.అంధత్వం లోపం కాదని ఉత్తమ ప్రతిభ చూపెట్టిన పలువురు ఉద్యోగులను జిల్లా అదనపు కలెక్టర్ సన్మానించారు.కుడకుడ యం పి పి ఎస్ కి చెందిన ఉపాధ్యాయుడు రవీందర్ మాట్లాడుతూ అంధులు విలువలతో ఒక్కరి మీద ఆధారపడకుండ స్వతంత్రంగా బ్రతకాలని అప్పుడు సమాజం మానవతా దృక్పధం తో సహాయం చేస్తారని తెలిపారు.
జిల్లా బ్లైండ్ అసోసియేషన్ అధ్యక్షులు ఐలాపురం యం పి పి ఎస్ స్కూల్ టీచర్ సోమయ్య మాట్లాడుతూ పట్టుదల తో ఏదైన సాధించవచ్చని, పెన్ పహాడ్ ఉన్నత పాఠశాల జూనియర్ అసిస్టెంట్ వెంకటయ్య అంధుల గొప్పతనం గురించి పాట పాడి ఉత్సాహ పరిచారు.ఇమంపేట మోడల్ స్కూల్ గణితం మాస్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ అంధులు అన్ని అవకాశలు ఉపయోగించుకుంటూనారని ప్రస్తుతం సాప్ట్ వేర్ జాబ్ లలో కూడా రాణిస్తున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి నరసింహరావు, జిల్లా ఎస్ సి సంక్షేమ అధికారి లత, మెప్మా పి డి రేణుక , జిల్లా శిశు, మహిళా,వికలాంగుల సంక్షేమ శాఖ ఉద్యోగులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
