తపాలా శాఖలో చిరుద్యోగి సేవలు చిరస్మరణీయం
సంగారెడ్డి, భారతశక్తి ప్రతినిధి,: తపాలా శాఖలో గత 42 సంవత్సరాలుగా సోమక్కపేట్ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ లో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ గా మహమ్మద్ అల్తాఫ్ హుస్సేన్ అందించిన సేవలు చిరస్మరణీయమని సంగారెడ్డి సబ్ డివిజన్ మెయిల్ ఓవర్సీర్ డి. శ్రీనివాస్ కొనియాడారు. శనివారం నాడు సోమక్కపేట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ మహమ్మద్ అల్తాఫ్ హుస్సేన్ పదవీ విరమణ వీడ్కోలు సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎంఓ మాట్లాడుతూ నాలుగు దశాబ్దాల పైన బ్రాంచ్ పోస్ట్మాస్టర్ గా, పోస్ట్ మ్యాన్ గా ప్రస్తుతం 8 గ్రామ పంచాయతీలు, 16 తండాల గ్రామాల ప్రజలకు ఉత్తరాల బట్వాడా చేసి అల్తాఫ్ హుస్సేన్ ప్రజలకు అందించిన తపాలా సేవలు అమోఘమని అభినందించారు. గత కొంతకాలంగా ఆరోగ్యం సహకరించకపోయిన తన కుమారుని (ఆసిఫ్) సహాయంతో ఆసరా పింఛన్లు, కూలీల వేతనాలు చెల్లింపులు, ఉత్తరాల బట్వాడా నిరంతరంగా చేయడం గమనార్వమని నొక్కి చెప్పారు. ప్రజల్లో పోస్టల్ డిపార్ట్మెంట్ పట్ల ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా తన కుమారుని సహాయంతో రిటైర్మెంట్ వరకు విధులు నిర్వహించడం విశేషమని పేర్కొన్నారు. తపాలా శాఖ లో పని చేసి ఈ రోజు పదవి విరమణ పొందుతున్న సందర్భంగా తపాలా శాఖ చిరుద్యోగి మహమ్మద్ అల్తాఫ్ హుస్సేన్ శేష జీవితం ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో గడవాలని సంగారెడ్డి సబ్ డివిజన్ ఏం వో శ్రీనివాస్ ఆకాంక్షించారు. ప్రతి ఉద్యోగి ఎప్పుడో ఒకప్పుడు పదవీ విరమణ పొందడం సహజమని సబ్ పోస్ట్ మాస్టర్ అవినాష్ అన్నారు. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ గా మహమ్మద్ అల్తాఫ్ హుస్సేన్ తపాలా శాఖకు ప్రజలకు అందించిన సేవలు మరువరానివని ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా సిరిపురం సబ్ పోస్ట్ ఆఫీస్ పరిధిలోని వివిధ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ లకు చెందిన బ్రాంచ్ పోస్ట్మాస్టర్లు, ఏబీపీపిఏం లు పదవీ విరమణ పొందుతున్న మహమ్మద్ అల్తాఫ్ హుస్సేన్ ను శాలువా తో సన్మానించి బహుమతులను అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సబ్ పోస్ట్ మాస్టర్ అవినాష్, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లు బన్యా, చలపతి, అమృతయ్య, షఫీ, అంజమ్మ, ఆకాష్, ఏ బి పి ఏం లు మహేందర్, అంజ్యా, శ్రీకాంత్ , ఫేరోజ్, శోభ తదితరులు పాల్గొన్నారు.
సంగారెడ్డి, భారతశక్తి ప్రతినిధి,:
తపాలా శాఖలో గత 42 సంవత్సరాలుగా సోమక్కపేట్ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ లో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ గా మహమ్మద్ అల్తాఫ్ హుస్సేన్ అందించిన సేవలు చిరస్మరణీయమని సంగారెడ్డి సబ్ డివిజన్ మెయిల్ ఓవర్సీర్ డి. శ్రీనివాస్ కొనియాడారు.
శనివారం నాడు సోమక్కపేట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ మహమ్మద్ అల్తాఫ్ హుస్సేన్ పదవీ విరమణ వీడ్కోలు సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎంఓ మాట్లాడుతూ నాలుగు దశాబ్దాల పైన బ్రాంచ్ పోస్ట్మాస్టర్ గా, పోస్ట్ మ్యాన్ గా ప్రస్తుతం 8 గ్రామ పంచాయతీలు, 16 తండాల గ్రామాల ప్రజలకు ఉత్తరాల బట్వాడా చేసి అల్తాఫ్ హుస్సేన్ ప్రజలకు అందించిన తపాలా సేవలు అమోఘమని అభినందించారు.
గత కొంతకాలంగా ఆరోగ్యం సహకరించకపోయిన తన కుమారుని (ఆసిఫ్) సహాయంతో ఆసరా పింఛన్లు, కూలీల వేతనాలు చెల్లింపులు, ఉత్తరాల బట్వాడా నిరంతరంగా చేయడం గమనార్వమని నొక్కి చెప్పారు.
ప్రజల్లో పోస్టల్ డిపార్ట్మెంట్ పట్ల ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా తన కుమారుని సహాయంతో రిటైర్మెంట్ వరకు విధులు నిర్వహించడం విశేషమని పేర్కొన్నారు. తపాలా శాఖ లో పని చేసి ఈ రోజు పదవి విరమణ పొందుతున్న సందర్భంగా తపాలా శాఖ చిరుద్యోగి మహమ్మద్ అల్తాఫ్ హుస్సేన్ శేష జీవితం ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో గడవాలని సంగారెడ్డి సబ్ డివిజన్ ఏం వో శ్రీనివాస్ ఆకాంక్షించారు.
ప్రతి ఉద్యోగి ఎప్పుడో ఒకప్పుడు పదవీ విరమణ పొందడం సహజమని సబ్ పోస్ట్ మాస్టర్ అవినాష్ అన్నారు. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ గా మహమ్మద్ అల్తాఫ్ హుస్సేన్ తపాలా శాఖకు ప్రజలకు అందించిన సేవలు మరువరానివని ఆయన కొనియాడారు.
ఈ సందర్భంగా సిరిపురం సబ్ పోస్ట్ ఆఫీస్ పరిధిలోని వివిధ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ లకు చెందిన బ్రాంచ్ పోస్ట్మాస్టర్లు, ఏబీపీపిఏం లు పదవీ విరమణ పొందుతున్న మహమ్మద్ అల్తాఫ్ హుస్సేన్ ను శాలువా తో సన్మానించి బహుమతులను అందజేసి ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో సబ్ పోస్ట్ మాస్టర్ అవినాష్, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లు బన్యా, చలపతి, అమృతయ్య, షఫీ, అంజమ్మ, ఆకాష్, ఏ బి పి ఏం లు మహేందర్, అంజ్యా, శ్రీకాంత్ , ఫేరోజ్, శోభ తదితరులు పాల్గొన్నారు.
