మండల ప్రజల అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తా : జడ్పీటీసీ సభ్యులు బెల్లం శ్రీనివాస్

తిరుమలాయపాలెం మండల సర్వతో ముఖాభివృద్ధికై తన శాయశక్తులా శ్రమిస్తానని జెడ్పీటీసీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బెల్లం శ్రీనివాసరావు పేర్కొన్నారు ఆయన పదవి మూడు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఆయన చాంబర్లో విలేఖరులతో మాట్లాడుతూ తనను నమ్మి జడ్పీటీసీగా మండల ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించి మూడు సంవత్సరాలు పూర్తయిందని తన శాయశక్తుల మేరకు మూడు సంవత్సరాలుగా ప్రజల సమస్యలపై ఉద్యమాలు నిర్వహించానని చెప్పారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు నల్ల చట్టాలను రద్దు చేయడంతో వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులను సమీకరించి అనేక ఉద్యమాలు నిర్వహించామని పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం పెంచిన డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించాలని ప్రజలను ఉవ్వెత్తున ఉద్యమంలోకి నడిపించానని అన్నారు .ప్రజల సమస్యలను తన సమస్యగా భావించి నిరంతరం వారి సమస్యల పరిష్కారం కోసం తోడుగా నీడగా నిలిచానని చెప్పారు . భవిష్యత్తులో పాలకవర్గాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు తాను నిరంతరం ప్రజల పక్షాన నిలబడతానని పునరుద్ఘాటించారు.ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ఎస్కె కరీమ్ ఊడుగు ఉపేందర్ గోళ్ల లింగయ్య గోగులపాడు సర్పంచ్ నల్లబెల్లి లింగయ్య కోట్ల కిరణ్ రేఖా ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు

About The Author

Related Posts