ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించి, పెండింగ్ లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ లు డా. పి. శ్రీజ, పి. శ్రీనివాస్ రెడ్డి లతో కలిసి దరఖాస్తులు స్వీకరించారు. సత్తుపల్లి మండలం గంగారం పి.హెచ్.సి. కు చెందిన ఎన్. మారేశ్వరి తాను కాంటిన్జెంట్ వర్కర్ గా పని చేస్తున్నానని, తనకు నెలకు 5 వేల రూపాయల జీతం ఉందని, గత 30 నెలలుగా హెచ్.డి.ఎస్. బడ్జెట్ లేదని వేతనం ఇవ్వడం లేదని, పెండింగ్ వేతనాలు ఇప్పిస్తూ ఫుల్ టైం లేదా పార్ట్ టైం కాంటిన్జెంట్ వర్కర్ గా నియమించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారికి రాస్తూ పరిశీలించి వెంటనే అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. తల్లాడ మండలం కలకొడిమ గ్రామానికి చెందిన ఆదూరి శిరిషా తాను నిరుపేద ఎస్సి కుటుంబానికి చెందిన మహిళ అని, గతంలో ప్రజా పాలనలో ఇందిరమ్మ ఇల్లు కొరకు దరఖాస్తు చేసుకున్నానని, ప్రస్తుతం జరుగుతున్న సర్వేలో తన పేరు రాలేదని, తనకు ఇల్లు ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, ఈఈ హౌసింగ్ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. కారేపల్లి మండలానికి చెందిన బాదావత్ రాము ఏన్కూరు మండలం గార్లోడ్డు గ్రామంలోని లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ లో జూనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న నారాయణరావును పర్శా అనంత రామయ్య ట్రస్ట్ కు చేసిన అక్రమ డిప్యూటేషన్ ను రద్దు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, అదనపు కలెక్టర్ కు రాస్తూ దేవాదాయ శాఖ దగ్గర నుంచి నివేదిక తెప్పించుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో డి.ఆర్.డి.ఓ. సన్యాసయ్య, డి.ఆర్.ఓ. రాజేశ్వరి, కలెక్టరేట్ ఏ.ఓ. అరుణ, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించి, పెండింగ్ లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అధికారులను ఆదేశించారు.
సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ లు డా. పి. శ్రీజ, పి. శ్రీనివాస్ రెడ్డి లతో కలిసి దరఖాస్తులు స్వీకరించారు.
సత్తుపల్లి మండలం గంగారం పి.హెచ్.సి. కు చెందిన ఎన్. మారేశ్వరి తాను కాంటిన్జెంట్ వర్కర్ గా పని చేస్తున్నానని, తనకు నెలకు 5 వేల రూపాయల జీతం ఉందని, గత 30 నెలలుగా హెచ్.డి.ఎస్. బడ్జెట్ లేదని వేతనం ఇవ్వడం లేదని, పెండింగ్ వేతనాలు ఇప్పిస్తూ ఫుల్ టైం లేదా పార్ట్ టైం కాంటిన్జెంట్ వర్కర్ గా నియమించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారికి రాస్తూ పరిశీలించి వెంటనే అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
తల్లాడ మండలం కలకొడిమ గ్రామానికి చెందిన ఆదూరి శిరిషా తాను నిరుపేద ఎస్సి కుటుంబానికి చెందిన మహిళ అని, గతంలో ప్రజా పాలనలో ఇందిరమ్మ ఇల్లు కొరకు దరఖాస్తు చేసుకున్నానని, ప్రస్తుతం జరుగుతున్న సర్వేలో తన పేరు రాలేదని, తనకు ఇల్లు ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, ఈఈ హౌసింగ్ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
కారేపల్లి మండలానికి చెందిన బాదావత్ రాము ఏన్కూరు మండలం గార్లోడ్డు గ్రామంలోని లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ లో జూనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న నారాయణరావును పర్శా అనంత రామయ్య ట్రస్ట్ కు చేసిన అక్రమ డిప్యూటేషన్ ను రద్దు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, అదనపు కలెక్టర్ కు రాస్తూ దేవాదాయ శాఖ దగ్గర నుంచి నివేదిక తెప్పించుకోవాలని కలెక్టర్ సూచించారు.
ఈ ప్రజావాణి కార్యక్రమంలో డి.ఆర్.డి.ఓ. సన్యాసయ్య, డి.ఆర్.ఓ. రాజేశ్వరి, కలెక్టరేట్ ఏ.ఓ. అరుణ, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
