టెలికం బోర్డ్ అడ్వైజరీ కమిటీ మెంబర్ గా ఉమ్మినేని కృష్ణ
ఖమ్మం బ్యూరో, భారత శక్తి : బిఎస్ఎన్ఎల్ టెలికం బోర్డు అడ్వైజరీ కమిటీ మెంబర్ గా మండల పరిధిలోని గోవిందాపురం ఎల్ గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉమ్మినేని కృష్ణ నియమించబడ్డారు. ఈ సందర్భంగా ఉమ్మినేని కృష్ణ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి టెలికం బోర్డు మెంబర్ గా నియామక పత్రం అందజేసిన ఖమ్మం ఎంపీ రాం సహాయం రఘురాం రెడ్డి, మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్చార్జ్ తుంబురు దయాకర్ రెడ్డి కి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. బిఎస్ఎన్ఎల్ అభివృద్ధిలో తన వంతు సహాయ సహకారాలు సంస్థకు అందజేస్తానని ఆయన తెలిపారు. గ్రామీణ స్థాయిలో బిఎస్ఎన్ఎల్ సేవలు మెరుగయ్యేందుకు కృషి చేస్తానన్నారు.