ఎల్.బి. నగర్ నియోజకవర్గ ప్రతిష్టకు మచ్చ తెస్తున్న జీ.హెచ్.ఎం.సి. సర్కిల్‌..

- అడ్డగోలుగా దోచుకుంటున్న అవినీతి అధికారులు.. 
- పన్నులు కడుతున్న ప్రజలకు తప్పని ఇక్కట్లు.. 
- ఎల్.బీ. నగర్ లో అవినీతి అనేది ఒక వ్యవస్థగా మారింది.. 
- న్యాయం అనే పదాన్ని తొలగించి లంచం అనే పదాన్ని చేర్చిన దుర్మార్గం.. 
- అది చిన్న అనుమతి అయినా సరే పెద్ద మొత్తంలో చెల్లించాల్సిందే.. 
- సాధారణ పౌరుడు ఒక గుంట స్థలం కొనాలన్నా.. ఒక్క రూం నిర్మించాలన్నా.. 
- అనుమతులకోసం పడిగాపులు పడాల్సిందే.. కంట తడి ఎండిపోవాల్సిందే.. 
- విచిత్రం ఏమిటంటే అక్రమ నిర్మాణాలకు మాత్రం క్షణాల్లో అనుమతులు దొరికిపోతాయ్.. 
- క్రింది స్థాయి ఉద్యోగి మొదలుకుని, కమిషనర్ స్థాయి వరకు అందరూ లంచావతారాలే.. 
- ఎన్ని కథనాలు రాసినా.. ఎన్నిసార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం.. 
- రైట్ టు ఇన్ ఫార్మేషన్  కింద వివరాలు అడిగితే విసుక్కోవడం తప్ప ఒరిగేది ఏమీ లేదు.. 
- అసలు ఎల్.బీ. నగర్ నియోజకవర్గంలో జీ.హెచ్.ఎం.సి. సర్కిల్ పనిచేస్తోందా..? 
- జీ.హెచ్.ఎం.సి. కమిషనర్ ఆర్.వి. కర్ణన్ ఓసారి ఇక్కడ పరిస్థితులపై ఓ లుక్ వెయ్యాలి.. 
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ గా ఈ విషయంపై ఆలోచించాలి.. 
- ఎల్.బీ. నగర్ ప్రజలను కాపాడేందుకు నడుం కట్టింది " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ "...    

download

( స్పెషల్ కరస్పాండెంట్, హైదరాబాద్ ) : 

Read More గవర్నర్ పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

ఎల్.బీ. నగర్ ఒక పెద్ద నియోజకవర్గం.. హైదరాబాద్ నగరానికి ఎంతో వన్నె తెచ్చిన విశిష్టమైన నియోజకవర్గం.. ఇక్కడ దేశంలోని అన్ని రాష్ట్రాల, అన్ని ప్రాంతాల ప్రజలు జీవనం సాగిస్తుంటారు.. ఎవరినైనా తన అక్కున చేర్చుకుని ఆదరిస్తుంది ఈ నియోజకవర్గం.. అలాంటి నియోజక వర్గాన్ని ఎంత గొప్పగా తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు ఉంది.. కానీ కీలకమైన ఎల్.బీ. నగర్ జీ.హెచ్.ఎం.సి. సర్కిల్ ఒక అవినీతి వ్యవస్థలా మారిపోవడం దురదృష్టకరం.. ఈ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న శాసన సభ్యులు కానీ, స్థానిక సంస్థల కార్పొరేటర్లు గానీ, వివిధ పార్టీల నాయకులు గానీ జీ.హెచ్.ఎం.సి. సర్కిల్ లో అతి భయంకరంగా పేరుకుపోయిన అవినీతిని అరికట్టలేక పోతున్నారు.. నిజానికి ఈ నాయకులే ఈ సర్కిల్ లో అవినీతిని ప్రోత్సహిస్తున్నారనే అపవాదు కూడా ఉంది.. తమ వారి పనులు జరగడానికి, అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇప్పించడానికి ఈ నాయకులే ముందుండి నడిపిస్తున్నారన్నది బహిరంగ సత్యం..  ఇక అధికారులకు పండుగే కదా..? కోరినంత డబ్బులు వస్తున్నప్పుడు వారుకూడా చెలరేగిపోతున్నారు..  డబ్భున్నవారి పనులు జరిగిపోతున్నాయి.. అది అక్రమం అయినా సరే.. అదే మధ్యతరగతి, నిరుపేద, సామాన్యుల పనులు  టేబిళ్ళ మీదే ఫైళ్ల రూపంలో ఉండిపోతున్నాయి..  లంచాలు చెల్లించడానికి డబ్బులు లేక.. విధిలేక.. ఉస్సూరుమంటూ విలపిస్తున్నారు వారు.. ఈ పరిస్థితుల్లో మార్పు నిజంగా వస్తుందా..? అన్న అనుమానం వ్యక్తం చేస్తోంది " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ ".. 

Read More బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహం పునఃస్థాపనను పరిశీలించిన అదనపు కలెక్టర్ విక్టర్, సబ్ కలెక్టర్ కిరణ్మయి

ఎల్.బి. నగర్ జీ.హెచ్.ఎం.సి. పరిధిలో అవినీతి ఒక వ్యవస్థలా మారిపోయింది. అధికారుల చేతుల్లో విధులు కాకుండా లంచం మాత్రమే నడుస్తోంది. చిన్న అనుమతికి కూడా లంచం ఇవ్వాల్సిందే.. ఫలితంగా స్థానిక స్థాయి అధికారులు ఈ సర్కిల్ లో  “అవినీతి సర్కిల్ సుల్తాన్లు”గా మారిపోయారు. వీరి దోపిడీకి బలయ్యేది సాధారణ పౌరులే. న్యాయం కోరితే వేధింపులు, దరఖాస్తు చేస్తే ఆలస్యం, ఫిర్యాదు చేస్తే ప్రతీకారం.. ఇది అక్కడి పరిస్థితి.

Read More హనుమకొండ లో హోటల్ కాకతీయ 369 మినీ బంకేట్ హల్ ప్రారంభం

ప్రభుత్వం అవినీతిని నిరోధిస్తామని గొప్ప గొప్ప నినాదాలు ఇస్తున్నా..  గ్రౌండ్ రియాలిటీ అంటే వాస్తవిక పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. అధికారులు ఒకరిని ఒకరు కాపాడుకుంటున్నారు. అవినీతిపై మాట్లాడే ప్రజలకు మౌనం మాత్రమే మిగిలిపోతోంది.

Read More ఆశయం శాశ్వతం.. లక్ష్యం తాత్కాలికం.. ఆచరణ కీలకం

ఇక ఎల్.బీ. నగర్ జీ.హెచ్.ఎం.సి. సర్కిల్ లో ఈ దోపిడీని ఆపకపోతే ప్రజల విశ్వాసం పూర్తిగా చచ్చిపోతుంది. ప్రజాస్వామ్యం అంటే ప్రజల పాలన. కానీ ఇక్కడ ప్రజల మీదే అవినీతి పాలన జరుగుతోంది. ప్రభుత్వం, విజిలెన్స్ విభాగం తక్షణం జోక్యం చేసుకొని, ఈ అవినీతి వ్యవస్థపై కఠిన చర్యలు తీసుకోవాలి. లేనిపక్షంలో “ఎల్.బి. నగర్ సర్కిల్” అనే పేరు అవినీతికి  చిహ్నంగా మారిపోతుంది.

Read More ఎత్తిపోతల పథకాల పర్యవేక్షణకు రైతు కమిటీలు

ఎల్.బి. నగర్ జీ.హెచ్.ఎం.సి. సర్కిల్‌లో అవినీతి తాండవం చేస్తోంది అన్నది నిర్విదాంశం.. నానాటికి ఈ నియోజక వర్గ ప్రజల విశ్వాసాలు తల్లకిందులై సన్నగిల్లిపోతున్న దారుణ పరిస్థితులు నెలకొన్నాయి.. మరీ ఈ మధ్య కాలంలో ప్రజల నోళ్లలో ఒకే మాట వినిపిస్తోంది.. "అధికారుల దోపిడీ ఎక్కడ చూసినా విస్తరిస్తోంది". నగరాభివృద్ధి పేరుతో ప్రతి పని వెనక అవినీతి వాసన వస్తోంది.
ప్రతి ఫైల్, ప్రతి అనుమతి, ప్రతి పాస్...  అధికారుల “కమీషన్ కోటా” లేకుండా కదలడం అసాధ్యం అనేది ఇక్కడ నెలకొని ఉంది.

Read More టెన్త్ విద్యార్థులకు కేంద్ర మంత్రి బండి నజరాన

ఇక్కడ సాధారణ పౌరుడు తన ఇల్లు నిర్మించుకోవాలన్నా, చిన్న వ్యాపారం మొదలుపెట్టాలన్నా, ఒక ప్లాన్ అప్రూవల్ కోసం ఫైల్ పెట్టినా అధికారుల చేతుల్లో లంచం పడకుంటే ఆ ఫైల్ అధికారుల కంటికి కనిపించదు.. ఒకవేల ఏ దరఖాస్తుదారుడైనా గట్టిగా అడిగితే ఫైల్ “మిస్సింగ్” అనే సమాధానం వస్తుంది..  ఫిర్యాదు చేస్తే “వేరే విభాగానికి పంపాం” అని తప్పించుకోవడం ఇక్కడ పరిపాటి అయిపొయింది.. 
పాత ఇళ్ల రీజిస్ట్రేషన్, హౌస్ ట్యాక్స్ సవరణలు, నల్లా కనెక్షన్, రోడ్డు రిపేర్.. ఈ విధంగా ప్రతి చిన్న పనికి పెద్ద కమీషన్ కోరుతున్నారు. అదికూడా బహిరంగంగానే జరుగుతోంది.. 

Read More ప్రభుత్వ పాఠశాలలో బాల్యవివాహాలపై అవగాహన కార్యక్రమం ఎంపీఓ చంద్రశేఖర్.

మరి ఉన్నతాధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారు..?

Read More సాహితీ రాము స్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాముల శబరిమల మహాపాదయాత్ర

ఎల్.బి. నగర్ జీ.హెచ్.ఎం.సి. సర్కిల్‌లో అవినీతి వ్యవస్థపై ఫిర్యాదులు పెద్ద ఎత్తున ఉన్నప్పటికీ, ఉన్నతాధికారులు మాత్రం ఏదో కారణాలతో మౌనం వహిస్తున్నారు. వారి కళ్ళముందే సర్కిల్ లో అవినీతి బలపడుతోంది..  ప్రజల న్యాయబద్ధమైన సమస్యలు రోజురోజుకూ పెరిగిపోతున్నా, ఎవరూ స్పందించడం లేదు. “తప్పు చేసిన వారిని కాపాడటం, నిజం చెప్పిన వారిని వేధించడం” అనే విధానం అక్కడ సర్వసాధారణం అయిపోయింది.

Read More డ్రైవర్లు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి

ప్రజలు అవినీతికి అడ్డంగా బలవుతున్న దుస్థితి :

Read More నేటి భారతం :

నగరాభివృద్ధి పేరుతో భూములు ఆక్రమించబడుతున్నాయి, డ్రెయినేజీ పనులు అర్ధంతరంగా వదిలేస్తున్నారు, కాంట్రాక్టులు “పర్సనల్ లింక్స్” ఆధారంగా ఇస్తున్నారు. ప్రజలు ఫిర్యాదు చేయాలంటే భయపడుతున్నారు.. ఎందుకంటే ఫిర్యాదు చేసిన తర్వాత వాళ్ల పనులు మరింత ఆలస్యం అవుతాయనే భయం ఉంది. ఈ పరిస్థితుల్లో న్యాయం కోరడం ప్రజలకే ప్రమాదంగా మారిపోయింది.

ప్రభుత్వం ఎక్కడ? ఏమి చేస్తోంది..?

ప్రతి ఎన్నికల ముందు “అవినీతి రహిత పాలన” అని గొంతు చించుకున్న ప్రభుత్వం..  ఇలాంటి సర్కిల్‌లలో జరుగుతున్న దోపిడీపై మాత్రం కళ్ళు మూసుకుంటోంది.. నోరుమెదపడం లేదు..  మరీ విచిత్రం ఏమిటంటే విజిలెన్స్ విభాగం, అవినీతి నిరోధక బ్యూరో వంటి సంస్థలు కేవలం కాగితాల మీదే ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. ప్రజలు న్యాయం కోసం తలుపులు తట్టి తిరుగుతుంటే, అధికారులు లంచపు నోట్లతో రాజ్యం చేస్తున్నారు.

ఇంకా మౌనం వహించడం సరికాదు :

ఎల్.బి. నగర్ సర్కిల్ పరిస్థితి ఒక ఉదాహరణ మాత్రమే..  ఇక ఈ అవినీతి వ్యవస్థను చీల్చి, ప్రజల న్యాయాన్ని పునరుద్ధరించడానికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. అవినీతికి పాల్పడిన అధికారులపై సస్పెన్షన్‌లు, దర్యాప్తులు, విజిలెన్స్ విచారణలు వెంటనే జరగాలి. అంతేకాదు పౌరులు కూడా మౌనం వీడి ప్రశ్నించడం నేర్చుకోవాలి.. న్యాయం జరిగేవరకూ నిలబడాలి.
ఎందుకంటే  “ప్రజాస్వామ్యంలో ప్రజలే బలహీనమైతే, అవినీతి బలపడుతుంది.”

ఎల్.బి. నగర్ ప్రజల కోసం న్యాయం సాధించాలంటే, ఇప్పుడు మాట్లాడాల్సిన సమయం ఆసన్నమైంది.. అంతే కాకుండా ఈ సర్కిల్ లో జరిగిన అవినీతి వ్యవహారాలు ఒకటి కాదు రెండు కాదు.. కోకొల్లలు.. వాటన్నింటినీ సాక్షాధారాలతో సహా వెలుగులోకి వరుస కథనాల ద్వారా తీసుకుని  రానుంది.. " భారత శక్తి " సహకారంతో " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ "..

About The Author