జయం రవి, నయనతారల క్రైమ్ థ్రిల్లర్ రెడీ టు రిలీజ్

తనిఒరువన్’ (Thani Oruvan) వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్‌ తర్వాత జయం రవి (Jayam Ravi), నయనతార (Nayanthara) హీరోహీరోయిన్లుగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘గాడ్’ (God). ఐ అహ్మద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సుధన్ సుందరం, జి.జయరాం, సి.హెచ్.సతీష్ కుమార్ నిర్మాతలు. తమిళంలో ఘన విజయం సాధించిన ఈ చిత్రం అక్టోబర్ 13న తెలుగులో విడుదలయ్యేందకు సిద్ధమైంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. (God Ready to Release) ఈ సందర్భంగా నిర్మాతలు సుధన్ సుందరం, జి.జయరాం, సి.హెచ్.సతీష్ కుమార్ మాట్లాడుతూ (God Movie Producers).. ‘‘క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలను ప్రేక్షకులెప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. ఆ కోవలో తమిళంలో విడుదలై మంచి విజయాన్ని సాధించిన ‘ఇరైవన్’ చిత్రాన్ని తెలుగులో ‘గాడ్’ అనే పేరుతో విడుదల చేస్తున్నాం. సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ర‌న్ టైమ్‌ను 2 గంట‌ల 16 నిమిషాలుగా ఫిక్స్ చేశాం. హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్న జయం రవి, నయనతార ఇందులో మళ్లీ జత కట్టారు. అక్టోబర్ 13న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఆసాంతం సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా మెప్పిస్తుంది. సెన్సార్ నుంచి కూడా మంచి ప్రశంసలు అందాయి. థియేటర్లలో ప్రేక్షకులు సైతం ఇలాంటి అనుభూతినే పొందుతారనే భావనతో ఉన్నాం. తప్పకుండా ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అని తెలిపారు.

జయం రవి, నయనతారల క్రైమ్ థ్రిల్లర్ రెడీ టు రిలీజ్

తనిఒరువన్’ (Thani Oruvan) వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్‌ తర్వాత జయం రవి (Jayam Ravi), నయనతార (Nayanthara) హీరోహీరోయిన్లుగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘గాడ్’ (God). ఐ అహ్మద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సుధన్ సుందరం, జి.జయరాం, సి.హెచ్.సతీష్ కుమార్ నిర్మాతలు. తమిళంలో ఘన విజయం సాధించిన ఈ చిత్రం అక్టోబర్ 13న తెలుగులో విడుదలయ్యేందకు సిద్ధమైంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. (God Ready to Release)

ఈ సందర్భంగా నిర్మాతలు సుధన్ సుందరం, జి.జయరాం, సి.హెచ్.సతీష్ కుమార్ మాట్లాడుతూ (God Movie Producers).. ‘‘క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలను ప్రేక్షకులెప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. ఆ కోవలో తమిళంలో విడుదలై మంచి విజయాన్ని సాధించిన ‘ఇరైవన్’ చిత్రాన్ని తెలుగులో ‘గాడ్’ అనే పేరుతో విడుదల చేస్తున్నాం. సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ర‌న్ టైమ్‌ను 2 గంట‌ల 16 నిమిషాలుగా ఫిక్స్ చేశాం. హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్న జయం రవి, నయనతార ఇందులో మళ్లీ జత కట్టారు. అక్టోబర్ 13న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఆసాంతం సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా మెప్పిస్తుంది. సెన్సార్ నుంచి కూడా మంచి ప్రశంసలు అందాయి. థియేటర్లలో ప్రేక్షకులు సైతం ఇలాంటి అనుభూతినే పొందుతారనే భావనతో ఉన్నాం. తప్పకుండా ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అని తెలిపారు.

About The Author

Related Posts