కుర్రాళ్లు బుల్లెట్ దింపారు
హోరాహోరీ పోరులో కుర్రాళ్లు బుల్లెట్ దించారు.. స్వర్ణం ఎగరేసుకుపోయారు. సరబ్‌జోత్ అదరగొట్టడంతో 10 మీ. ఎయిర్ పిస్టల్ టీమ్ పసిడితో మెరిసింది. ఈక్వెస్ట్రియన్ డ్రెస్సేజ్‌లో అనూష్ కాంస్యం సాధించగా.. ఫైనల్ ఫైట్‌లో ఓటమితో రోహిబినా దేవి రెండో స్థానం దక్కించుకొంది. ఆటలకు ఐదో రోజు మూడు పతకాలు మాత్రమే సాధించిన భారత్.. మొత్తం 25 పతకాల (6 స్వర్ణ, 8 రజత, 11 కాంస్య)తో ఐదో స్థానంలో ఉంది. హాంగ్జౌ: ఆద్యంతం ఉత్కంఠగా సాగిన పోరులో.. చైనాకు ఝలక్ ఇచ్చిన భారత యువ షూటర్లు స్వర్ణం గెల్చుకున్నారు. గురువారం జరిగిన 10 మీ. ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో భారత షూటర్లు సరబ్‌జోత్ సింగ్, అర్జున్ సింగ్, శివ నర్వాల్‌ల త్రయం 1734 పాయింట్లతో టాప్‌లో నిలిచి పసిడి పట్టేసింది. షూటింగ్ టీమ్ ఈవెంట్‌లో భారత్‌కు ఇది మూడో స్వర్ణం. చైనా (1733) రజతం, వియత్నాం (1730) కాంస్యం అందుకొన్నాయి. ఇదే ఈవెంట్ వ్యక్తిగత విభాగంలో సరబ్‌జోత్ 199 పాయింట్లతో నాలుగో స్థానం, చీమా ఎనిమిదో స్థానంలో నిలిచారు. అర్జున్ రెండో ఎలిమినేషన్‌లోనే అవుటయ్యాడు. 10 మీ. ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ విభాగంలో దివ్యాంశ్ పన్వర్, రమితా జిందాల్ జంట నాలుగో స్థానంలో నిలిచింది. రుద్రాంక్ష్ పాటిల్, మెహూలీ ఘోష్ కూడా ఈ కేటగిరీలోనే బరిలోకి దిగే ప్రయత్నం చేసినా.. ఒక్క జోడీ మాత్రమే బరిలో నిలవాలనే నిబంధన కారణంగా తప్పుకోవాల్సి వచ్చింది. డ్రెస్సేజ్‌లో తొలిసారి: ఈక్వెస్ట్రియన్ డ్రెస్సేజ్ వ్యక్తిగత విభాగంలో అనూష్ అగర్వాలా భారత్‌కు చారిత్రక పతకం అందించాడు. పురుషుల డ్రెస్సేజ్‌లో అగర్వాలా 73.030 పాయింట్లతో కాంస్యం సాధించాడు. ఈ విభాగంలో వ్యక్తిగత పతకం గెలవడం ఆసియాడ్ చరిత్రలో ఇదే తొలిసారి. బిన్ మహ్మద్ ఫాతిల్ (75.780) స్వర్ణం గెలవగా.. జాక్వెలిన్ వింగ్ యంగ్ (73.450) రజతం సాధించాడు. మరో భారత రైడర్ హృదయ్ విపుల్ చద్దాపై అనర్హత వేటుపడింది. క్వాలిఫికేషన్ రౌండ్‌లో విపుల్ టాప్‌లో నిలిచినా.. అతడి అశ్వం గాయపడడంతో డిస్‌క్వాలిఫై అయ్యాడు. రోషిబినా..రజతమే: ఉషులో ఆశలురేపిన రోషిబినాదేవి రజతంతో సరిపెట్టుకొంది. మహిళల 60 కిలోల సాండా ఫైనల్లో రోషిబినా 0-2తో వు గ్జియావి (చైనా) చేతిలో పరాజయం పాలైంది. అయితే, పతకం అందుకొన్న తర్వాత ఆమె ఎంతో భావోద్వేగానికి గురైంది. మణిపూర్‌కు చెందిన రోషిబినా.. అక్కడ జరుగుతున్న అల్లర్లపై ఎంతో ఆవేదన వ్యక్తం చేసింది. తాను ఇంటికి కూడా వెళ్లలేకపోతున్నానని.. తన కుటుంబం, బంధువులను కలవలేక పోతున్నానని వాపోయింది. అయితే, వారికి ఫోన్ చేసినప్పుడు తామందరం క్షేమంగానే ఉన్నామని.. పతకంపైనే దృష్టిపెట్టమని ప్రోత్సహించారని తెలిపింది. ఏదిఏమైనా మణిపూర్‌లో వీలైనంత వేగంగా శాంతిని నెలకొల్పాలని కోరింది. తమను కాపాడుతున్న వాళ్లకు తన పతకాన్ని అంకితమిస్తున్నట్టు చెప్పింది.
హోరాహోరీ పోరులో కుర్రాళ్లు బుల్లెట్ దించారు.. స్వర్ణం ఎగరేసుకుపోయారు. సరబ్‌జోత్ అదరగొట్టడంతో 10 మీ. ఎయిర్ పిస్టల్ టీమ్ పసిడితో మెరిసింది. ఈక్వెస్ట్రియన్ డ్రెస్సేజ్‌లో అనూష్ కాంస్యం సాధించగా.. ఫైనల్ ఫైట్‌లో ఓటమితో రోహిబినా దేవి రెండో స్థానం దక్కించుకొంది. ఆటలకు ఐదో రోజు మూడు పతకాలు మాత్రమే సాధించిన భారత్.. మొత్తం 25 పతకాల (6 స్వర్ణ, 8 రజత, 11 కాంస్య)తో ఐదో స్థానంలో ఉంది.
హాంగ్జౌ: ఆద్యంతం ఉత్కంఠగా సాగిన పోరులో.. చైనాకు ఝలక్ ఇచ్చిన భారత యువ షూటర్లు స్వర్ణం గెల్చుకున్నారు. గురువారం జరిగిన 10 మీ. ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో భారత షూటర్లు సరబ్‌జోత్ సింగ్, అర్జున్ సింగ్, శివ నర్వాల్‌ల త్రయం 1734 పాయింట్లతో టాప్‌లో నిలిచి పసిడి పట్టేసింది. షూటింగ్ టీమ్ ఈవెంట్‌లో భారత్‌కు ఇది మూడో స్వర్ణం. చైనా (1733) రజతం, వియత్నాం (1730) కాంస్యం అందుకొన్నాయి. ఇదే ఈవెంట్ వ్యక్తిగత విభాగంలో సరబ్‌జోత్ 199 పాయింట్లతో నాలుగో స్థానం, చీమా ఎనిమిదో స్థానంలో నిలిచారు. అర్జున్ రెండో ఎలిమినేషన్‌లోనే అవుటయ్యాడు. 10 మీ. ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ విభాగంలో దివ్యాంశ్ పన్వర్, రమితా జిందాల్ జంట నాలుగో స్థానంలో నిలిచింది. రుద్రాంక్ష్ పాటిల్, మెహూలీ ఘోష్ కూడా ఈ కేటగిరీలోనే బరిలోకి దిగే ప్రయత్నం చేసినా.. ఒక్క జోడీ మాత్రమే బరిలో నిలవాలనే నిబంధన కారణంగా తప్పుకోవాల్సి వచ్చింది.
డ్రెస్సేజ్‌లో తొలిసారి: ఈక్వెస్ట్రియన్ డ్రెస్సేజ్ వ్యక్తిగత విభాగంలో
రోషిబినా..రజతమే: ఉషులో ఆశలురేపిన రోషిబినాదేవి రజతంతో సరిపెట్టుకొంది. మహిళల 60 కిలోల సాండా ఫైనల్లో రోషిబినా 0-2తో వు గ్జియావి (చైనా) చేతిలో పరాజయం పాలైంది. అయితే, పతకం అందుకొన్న తర్వాత ఆమె ఎంతో భావోద్వేగానికి గురైంది. మణిపూర్‌కు చెందిన రోషిబినా.. అక్కడ జరుగుతున్న అల్లర్లపై ఎంతో ఆవేదన వ్యక్తం చేసింది. తాను ఇంటికి కూడా వెళ్లలేకపోతున్నానని.. తన కుటుంబం, బంధువులను కలవలేక పోతున్నానని వాపోయింది. అయితే, వారికి ఫోన్ చేసినప్పుడు తామందరం క్షేమంగానే ఉన్నామని.. పతకంపైనే దృష్టిపెట్టమని ప్రోత్సహించారని తెలిపింది. ఏదిఏమైనా మణిపూర్‌లో వీలైనంత వేగంగా శాంతిని నెలకొల్పాలని కోరింది. తమను కాపాడుతున్న వాళ్లకు తన పతకాన్ని అంకితమిస్తున్నట్టు చెప్పింది.
