ప్రజలకు చేరువగా ప్రజా పాలన

ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ వికాస్ మహతో

ప్రజలకు చేరువగా ప్రజా పాలన

ఎల్బీనగర్:

ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రజలకు ఒక ప్రణాళిక బద్ధంగా సేవలను అందించడానికి కృషి చేస్తున్నామని ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ వికాస్ మహతో తెలిపారు. చైతన్యపురి డివిజన్ మాధవరెడ్డి కమ్యునిటీ హాల్ లో 99 రోజుల ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా శనివారం డిప్యూటీ కమీషనర్ బోనగిరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎల్బీనగర్ నియోజకవర్గం స్థాయి సమీక్ష సమావేశం జరిగింది.ఈ సమావేశానికి హాజరైన జోనల్ కమిషనర్ వికాస్ మహతో మాట్లాడుతూ, రాజకీయాలకు అతీతంగా 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని ఆయన వివరించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు లక్ష్యానికి అనుగుణంగా ముందుకు పోతున్నామని ఆయన తెలిపారు. ప్రధానంగా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలపై అర్హులైన వారికి అవగాహన లేదని జోనల్ కమిషనర్ అభిప్రాయపడ్డారు. సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులు అమలుపై ఎప్పటికప్పుడు అధికారులు ప్రజలకు అవగాహన కల్పించడంతో ఫలితాలు వస్తున్నాయని ఆయన వివరించారు.‌ ఈ సమావేశంలో మల్కాజిగిరి మున్సిపల్ అదనపు కమిషనర్ రఘుప్రసాద్, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి నవీన్ రెడ్డి,ఏఎస్ఓ పుల్లయ్య సరూర్ నగర్ తహసీల్దార్ పి. వేణు గోపాల్, హయత్ నగర్ తాహసీల్దార్ జానకి, ఎంఈఓ బసు నాయక్, నాయబ్ తహసీల్దార్ భాను ప్రసాద్, డిపిఓ విక్రాంత్ రెడ్డి, ఏఎంసీ ఖాదర్, కధీర్ ఆర్ఐ సహాదేవ్ రెడ్డి, జూనియర్ అసిస్టెంట్స్ నవీన్, ప్రభాకర్, ప్రవీణ్,మండల జీపిఓలు, తదితరులు పాల్గొన్నారు.‌ అదే విధంగా ఇదే సమావేశంలో సరూర్ నగర్ మండల పరిధిలోని మహిళా లబ్ధిదారులకు 22 కళ్యాణ లక్ష్మి,8 షాదీ ముబారక్ చెక్కులను అధికారులు అందజేశారు.ఈ సమావేశంలో  బిఎల్ఓలు, కాలనీ అధ్యక్షులు ప్రభుత్వ లబ్ధిదారులు పాల్గొన్నారు.

About The Author