పెద్ది శంకర్‌కు ‘దాసరి లెజెండరీ’ పురస్కారం
- సేవా రంగంలో ‘రెడీ టూ సర్వ్’ కృషికి గుర్తింపు
- పురస్కారాన్ని అందజేసిన దర్శకుడు బోయపాటి శ్రీను, నటుడు సుమన్
హైదరాబాద్ :
నగరంలోని ప్రసాద్ ల్యాబ్స్ వేదికగా ‘దాసరి లెజెండరీ ఫిలిం అవార్డ్స్–2026’ వేడుక శనివారం వైభవంగా జరిగింది. సినీ దిగ్గజం దాసరి నారాయణరావు స్మారకార్థం ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మిత్రబృందం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన ప్రముఖులకు ఈ సందర్భంగా పురస్కారాలను అందజేశారు.
*అట్టహాసంగా పురస్కార ప్రధానం
సామాజిక సేవా రంగంలో అంకితభావంతో పనిచేస్తున్న ‘రెడీ టూ సర్వ్’ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు "పెద్ది శంకర్" ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక దాసరి లెజెండరీ అవార్డుకు ఎంపికయ్యారు. ప్రముఖ దర్శకుడు "బోయపాటి శ్రీను". సీనియర్ నటుడు "సుమన్" ముఖ్య అతిథులుగా హాజరై పెద్ది శంకర్‌ను శాలువాతో సత్కరించి, అవార్డును ప్రదానం చేశారు.
అనాథలు, వృద్ధులు, మరియు నిరుపేదల సంక్షేమం కోసం పెద్ది శంకర్ చేస్తున్న నిరంతర కృషిని అతిథులు కొనియాడారు. అవార్డు స్వీకరించిన అనంతరం శంకర్ మాట్లాడుతూ.. తన సేవలను గుర్తించి ఈ గౌరవం అందించిన నిర్మాత రామసత్యనారాయణకు, అతిథులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పురస్కారం తనపై బాధ్యతను మరింత పెంచిందని, భవిష్యత్తులో సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తానని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు, సామాజిక వేత్తలు పాల్గొన్నారు.
