సాగర్ హైవేపై 'కవితక్క' మద్దతుదారుల హోరు

  • ఇబ్రహీంపట్నంలో వంద బైక్‌లతో భారీ ర్యాలీ
  • ఈ నెల 25న మేడ్చల్ వేదికగా కొత్త పార్టీ ప్రకటన!

సాగర్ హైవేపై 'కవితక్క' మద్దతుదారుల హోరు

ఇబ్రహీంపట్నం:

తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించబోయే నూతన రాజకీయ పార్టీకి మద్దతుగా రంగారెడ్డి జిల్లాలో పొలిటికల్ హీట్ పెరిగింది. ఈ నెల 25న మేడ్చల్ వేదికగా ఆమె కొత్త పార్టీని ప్రకటించనున్న నేపథ్యంలో, ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కంపాటి పాండురంగారెడ్డి వీచేశారు, మంచిరెడ్డి విజయ కిరణ్ రెడ్డి ఆధ్వర్యంలో మాల్ గ్రామం నుంచి సాగర్ హైవే మీదుగా నియోజకవర్గ కేంద్రం వరకు సుమారు వందలాది బైక్‌లతో కార్యకర్తలు ప్రదర్శన చేపట్టారు.

అమరుల ఆశయాల కోసమే కొత్త ప్రస్థానం
ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు కప్పాటి పాండురంగా రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ మలిదశ ఉద్యమ స్ఫూర్తితో, అమరవీరుల ఆశయాలను నిజం చేసే లక్ష్యంతోనే కవిత రాజకీయ ప్రయాణం మొదలవుతోందని పేర్కొన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణం, అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సరికొత్త రాజకీయ పంథాకు శ్రీకారం చుడుతున్నట్లు వివరించారు.

మేడ్చల్ సభకు తరలిరావాలి
జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు మంచిరెడ్డి విజయ్ కిరణ్ రెడ్డి, యువజన విభాగం నాయకుడు కర్నాటి చంద్రకాంత్ మాట్లాడుతూ.. 25న మేడ్చల్‌లో జరిగే చారిత్రాత్మక మహాసభకు ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి యువత, మహిళలు, రైతులు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

హోరెత్తిన సాగర్ హైవే
ర్యాలీ పొడవునా కార్యకర్తల నినాదాలతో సాగర్ హైవే ప్రాంతం మారుమోగింది. ఈ కార్యక్రమంలో కంబాలపల్లి చెన్నకిషన్ రెడ్డి, బట్టు దినేష్ రెడ్డి, ఎన్. నవీన్, బి. ప్రవీణ్ రెడ్డి, రాయకంటి జగన్ తదితరులు పాల్గొన్నారు.

About The Author