పారదర్శకతతో సంక్షేమ పథకాల అమలు..
- అభివృద్ధి..సంక్షేమమే మా తొలి ప్రాధాన్యత..
- పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి
- 226 మంది లబ్ధిదారులకు రెండు కోట్ల 26 లక్షల రూపాయల విలువైన కళ్యాణ లక్ష్మి..షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ..
పటాన్చెరు:
అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల అందిస్తూ పూర్తి పారదర్శక పాలన అందిస్తున్నామని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.
మంగళవారం పటాన్‌చెరు లోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో.. రామచంద్రాపురం, పటాన్చెరు, అమీన్‌పూర్ రెవెన్యూ మండలాల పరిధిలోని 226 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా మంజూరైన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. 
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు..jpeg)
About The Author
09 May 2026
