అభివృద్ధి పనుల్లో పరిశ్రమల భాగస్వామ్యం మరింత పెరగాలి..

  • పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి 
  • గుమ్మడిదల మున్సిపల్ కార్యాలయం అదనపు అంతస్తులు, పశువుల ఆసుపత్రి అదనపు గదుల నిర్మాణ పనులకు శంకుస్థాపన..

అభివృద్ధి పనుల్లో పరిశ్రమల భాగస్వామ్యం మరింత పెరగాలి..

గుమ్మడిదల:

గ్రామాలు, పట్టణాల అభివృద్ధిలో పరిశ్రమల భాగస్వామ్యం మరింత పెరగాల్సిన అవశ్యకత ఎంతైనా ఉందని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.

 గురువారం గుమ్మడిదల మున్సిపల్ కార్యాలయంలో హెట్రో పరిశ్రమ సౌజన్యంతో 80 లక్షల రూపాయల నిధులతో చేపట్టనున్న అదనపు అంతస్తులు, పశువుల ఆసుపత్రిలో న్యూ ల్యాండ్ పరిశ్రమ సహకారంతో 33 లక్షల రూపాయలు నిర్మించి తలపెట్టిన అదనపు గదుల నిర్మాణ పనులకు గురువారం ఉదయం ఎమ్మెల్యే జిఎంఆర్ శంకుస్థాపన చేశారు. WhatsApp Image 2026-05-07 at 14.59.49 (1)

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పరిపాలన సౌలభ్యం కోసం..ప్రజలకు మెరుగైన పరిపాలన అందించాలన్న లక్ష్యంతో గుమ్మడిదల మున్సిపల్ కార్యాలయం అదనపు అంతస్తుల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. త్వరితగతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని వస్తామని తెలిపారు. అభివృద్ధి పనులకు నిధులు కేటాయించిన పరిశ్రమల  యాజమాన్యాలకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. 

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కుమార్ గౌడ్, వైస్ చైర్మన్ సంధ్య గోవర్ధన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ దశరథ్, తహసిల్దార్ పరమేశం, ఎంపీడీవో ఉమాదేవి, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, సీనియర్ నాయకులు గోవర్ధన్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, విజయ భాస్కర్ రెడ్డి, హుస్సేన్, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.WhatsApp Image 2026-05-07 at 14.59.49

About The Author