తెలంగాణ జన సమితి రాష్ట్ర 4వ ప్లీనరీని విజయవంతం చేయండి

తెలంగాణ జన సమితి రాష్ట్ర 4వ ప్లీనరీని విజయవంతం చేయండి

సిద్దిపేట::

తెలంగాణ జన సమితి రాష్ట్ర 4వ ప్లీనరీని విజయవంతం చేయాలని సిద్దిపేట జిల్లా ఇంచార్జ్ బైరీ రమేష్ గారు పిలుపునిచ్చారు. మే 12వ తేదీన హైదరాబాద్‌లోని జలవిహార్ కన్వెన్షన్‌లో జరిగే ఈ ప్లీనరీకి సంబంధించి, సిద్దిపేట రంగనాథంపల్లి చౌరస్తా అమరవీరుల స్థూపం వద్ద జిల్లా అధ్యక్షుడు నీరుడి స్వామి  పార్టీ కార్యకర్తలతో కలిసి ప్లీనరీ పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా బైరీ రమేష్  మాట్లాడుతూ విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యల పరిష్కారం మరియు తెలంగాణ అమరుల ఆకాంక్షల సాధన కోసం పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం గారి నాయకత్వంలో నిరంతరం పోరాటం చేస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. రాబోయే ప్లీనరీలో నిరుద్యోగ సమస్య, ఫీజు రీయింబర్స్‌మెంట్, బీసీ రిజర్వేషన్లు, సింగరేణి పరిరక్షణ, పౌరుల ఓటు హక్కుపై ప్రభావం చూపే ఎస్ఐఆర్ ప్రక్రియ, దక్షిణ భారతదేశానికి అన్యాయం చేసే డీలిమిటేషన్ అంశాలపై కీలక తీర్మానాలు చేయనున్నట్లు తెలిపారు.జిల్లా అధ్యక్షుడు నీరుడి స్వామి మాట్లాడుతూ, గతంలో ప్రొఫెసర్ కోదండరాం గారితో కలిసి మల్లన్న సాగర్ బాధితుల పక్షాన అనేక పోరాటాలు నిర్వహించామని గుర్తు చేశారు. తెలంగాణ అస్తిత్వ ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం ఏర్పడిన టీజేఎస్ పార్టీ అదే దిశగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.  కార్యక్రమంలో జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కీసరీ స్వామి, పార్టీ నాయకులు ప్రవీణ్, అమోస్, బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

About The Author