తాండూర్ కాంగ్రెస్‌లో కొత్త నియామకాలు… పట్టణ అధ్యక్ష పదవి పై హాట్ టాపిక్
- తాండూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల నియామకం పూర్తి
- తాండూర్ పట్టణ అధ్యక్షుడిగా రొయ్యల నాగరాజు నియామకం
- జుబేర్ లాల్, లింగదలి రవికుమార్‌కు నిరాశ
- సోషల్ మీడియాలో ట్రోలింగ్, నాయకుల్లో అసంతృప్తి
- కొత్త అధ్యక్షుడిపై భారీ బాధ్యతలు
తాండూరు:
తాండూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలపర్చడానికి కీలక అడుగు పడింది. ఈ మేరకు మంగళవారం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అధికారికంగా నియామకాలను ప్రకటించారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాలతో పాటు తాండూర్ పట్టణానికి కూడా కొత్త అధ్యక్షులను నియమిస్తూ ప్రకటన విడుదల చేశారు.ఈ క్రమంలో తాండూర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రొయ్యల నాగరాజు (నాగు)ను నియమించారు. అదేవిధంగా పెద్దేముల్ మండల అధ్యక్షుడిగా పీనేముల మైపాల్ రెడ్డి, యాలల మండల అధ్యక్షుడిగా కురువ మైపాల్, బషీరాబాద్ మండల అధ్యక్షుడిగా పట్లోళ్ల రాజా వర్ధన్ రెడ్డి, తాండూర్ మండల అధ్యక్షుడిగా
రాజ్ కుమార్ మైలవరం లను నియమించారు.
అయితే ముఖ్యంగా తాండూర్ పట్టణ అధ్యక్ష పదవిపై తీవ్ర పోటీ నెలకొంది. గతంలో ఈ పదవికి జుబేర్ లాల్ మరియు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు లింగదలి రవికుమార్ మధ్య పోటీ నెలకొనగా, స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి జుబేర్ లాల్‌కు హామీ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. దీంతో సోషల్ మీడియాలో కూడా జుబేర్ లాల్ పేరుతో విస్తృతంగా చర్చ జరిగింది.
అయినప్పటికీ, పార్టీ అధిష్టానం చివరకు రొయ్యల నాగరాజును ఎంపిక చేయడం వల్ల జుబేర్ లాల్, లింగదలి రవికుమార్ వర్గాలకు నిరాశ కలిగింది. ఈ నేపథ్యంలో పలువురు కాంగ్రెస్ నాయకులు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
ఇక కొత్తగా బాధ్యతలు చేపట్టిన రొయ్యల నాగరాజు ముందున్న సవాళ్లు పెద్దవిగా కనిపిస్తున్నాయి. పట్టణంలో పార్టీని ఏకీకృతం చేయడం, అసంతృప్తులను సమతుల్యం చేయడం, పార్టీ కార్యకలాపాలను బలోపేతం చేయడం వంటి బాధ్యతలను ఎలా నిర్వహిస్తారో అన్నది ఆసక్తికరంగా మారింది.
తాండూర్ కాంగ్రెస్ రాజకీయాల్లో ఈ నియామకాలు కొత్త మలుపు తిప్పనున్నాయా లేదా అనేది వేచి చూడాల్సిందే..jpeg)
