తాండూర్ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో రైతులకు భరోసా కార్యక్రమం

  • రైతు భీమా పథకం , ఈ నామ్ 2.0 నమోదు పై ప్రభుత్వం ఫోకస్… రైతులు నమోదు తప్పనిసరి
  • ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగారైతులకు కీలక మార్గదర్శకాలు

తాండూర్ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో రైతులకు భరోసా కార్యక్రమం

తాండూరు:

ప్రజా పాలన ప్రగతిప్రణాళికలో భాగంగా వికారాబాద్ జిల్లాలో రైతుల సంక్షేమం పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు వ్యవసాయ శాఖ అధికారులు.
ఈ క్రమంలో వికారాబాద్ జిల్లాలోనీ అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ కమిటీ అయిన తాండూర్‌వ్యవసాయ మార్కెట్ కమిటీఆధ్వర్యం లో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యంగా రైతు భీమా పథకం, కేంద్ర ప్రభుత్వం 2.0 లో భాగంగా ఈనం 2.0 లో రైతుల నమోదు ప్రక్రియ పై రైతులకు అవగాహన కల్పించారు.బుధవారం
వికారాబాద్ జిల్లాలోని తాండూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రైతుల కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున రైతులు హాజరై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా అధికారులు రైతు భీమా పథకం, మరియు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ నామ్ 2.0 గురించి వివరించారు. రైతుల భద్రత కోసం ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకంలో నమోదు చేసుకోవడం ఎంత ముఖ్యమో తెలియజేశారు. అర్హులైన ప్రతి రైతు ఈ పథకంలో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు.WhatsApp Image 2026-05-06 at 20.30.54
అనంతరం వ్యవసాయ మార్కెట్ కమిటీ
గ్రేడ్2 కార్యదర్శి శ్రీనివాస్  మాట్లాడుతూ... రైతుల పంట క్రయవిక్రయాల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ నామ్ పద్ధతిలో ఇప్పుడు కొత్తగా 2.0 లో భాగంగా ఈ నామ్ లో కొత్త నిబంధనలు అమలు చేస్తుందని అన్నారు."రైతులందరూ రైతు భీమా పథకం అలాగే 2.0లో నమోదు చేసుకుని ప్రభుత్వ భద్రతా ప్రయోజనాలు పొందాలనీ తెలిపారు. ఎవరూ ఈ అవకాశాన్ని కోల్పోకూడదనీ పేర్కొన్నారు.ఆలాగే మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింలు మాట్లాడుతూ
ఈ కార్యక్రమం ద్వారా రైతుల్లో అవగాహన పెరగడంతో పాటు పథకాలపై మంచి స్పందన లభించిందనీ అన్నారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలను అధికారులు మరింతగా గ్రామస్థాయికి తీసుకెళ్తామని తెలిపారు.రైతుల అభివృద్ధి కోసం చేపడుతున్న ఈ కార్యక్రమాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు బలం చేకూరుస్తాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు హబీబ్ ,
సత్య కుమార్, మరియు సహాయ సూపర్వైజర్ ఎం సిద్ధమ్మ, మరియు వెంకటమ్మ, రవి మార్కెట్ కమిటీ సభ్యులు రైతులు తదితరులు పాల్గొన్నారుWhatsApp Image 2026-05-06 at 20.30.54 (1)

About The Author