దగాపడ్డ రైతుల పక్షాన పోరాటానికి అరెస్టులా?

  • అరెస్టులతో మా గొంతు నొక్కలేరు” 
  • బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు. రమేష్ కుమార్

దగాపడ్డ రైతుల పక్షాన పోరాటానికి అరెస్టులా?

తాండూర్ :

వికారాబాద్ జిల్లా 
తాండూర్ పట్టణంలో సోమవారం రైతు వారోత్సవ కార్యక్రమం నేపథ్యంలో  రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు పర్యట ఉండటంతో ముందస్తుగా  పోలీసులు బీజేపీ రాష్ట్ర నాయకుడు యు. రమేష్ కుమార్‌ తో పాటు కౌన్సిలర్లు నాగారం మల్లేశం, శ్రీకాంత్ రెడ్డి, అంతరం కిరణ్ ,రజిని లను
ముందస్తుగా అరెస్టు చేశారు.
కుటుంబ శుభకార్యం జరుగుతున్న సమయంలోనే, తన స్వగ్రామంలోని వ్యవసాయ క్షేత్రంలో ఉన్న రమేష్ కుమార్‌ను కూడా  ఉదయం 6 గంటల ప్రాంతంలో పెద్దేముల్ పోలీసులు  అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఈ సందర్భంగా యు. రమేష్ మాట్లాడుతూ 
రాష్ట్ర ప్రభుత్వం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.WhatsApp Image 2026-05-04 at 20.02.10
“ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందనీ అన్నారు. కానీ మంత్రులు జిల్లాకు వస్తున్నారంటే ముందే మమ్మల్ని అరెస్టు చేయించడం దుర్మార్గ రాజకీయానికి నిదర్శనం” అని అన్నారు.రైతు సమస్యలపై గళం విప్పితే అరెస్టులా? చేస్తారా అని ప్రశ్నించారు.
రైతు వారోత్సవాలు ఎవరి కోసం నిర్వహిస్తున్నారని,
రూ.2 లక్షల రుణమాఫీ అమలు కాలేదని, రైతు భరోసా అందడం లేదని, గిట్టుబాటు ధరలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు.
మంత్రులను నిలదీయాలనే ఉద్దేశంతోనే తమను అరెస్టు చేశారని ఆరోపించారు.
“మమ్మల్ని జైలులో పెట్టినా మా పోరాటం ఆగదుఅని అన్నారు .రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు బీజేపీ పోరాటం కొనసాగుతుంది. ముందస్తు అరెస్టులు చేయడం అంటేనే ప్రభుత్వం తన ఓటమిని ఒప్పుకున్నట్టే” అని అన్నారుWhatsApp Image 2026-05-04 at 20.02.09

About The Author