తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట ప్రణాళిక..
- ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
- జలమండలి అధికారులతో సమీక్ష..
పటాన్చెరు:
ప్రస్తుత వేసవి కాలంలో కాలనీలలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని.. నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పరిస్థితులను సమీక్షించాలని జలమండలి అధికారులకు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సూచించారు.
మంగళవారం సాయంత్రం పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని కాంప కార్యాలయంలో అమీన్పూర్ సర్కిల్, పటాన్‌చెరు సర్కిల్ జలమండలి అధికారులతో తాగునీటి పంపిణీ పై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఇందుకు అధికారులు స్పందిస్తూ..ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు. అవసరమైన చోట కొత్త బోర్లు త్రవ్వడం, నిల్వ ట్యాంకుల శుభ్రపరిచే పనులు చేపడుతున్నామని వివరించారు.
ఈ సమావేశంలో జలమండలి డీజీఎం లు శివకుమార్, శ్రీనివాసరావు, మేనేజర్లు ప్రవీణ్, శ్రీకాంత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
About The Author
09 May 2026
