తమిళనాడులో కొత్త రాజకీయ అధ్యాయం ప్రారంభం కావాలి

తిమ్మాపూర్ సర్పంచ్ గుర్రాల శ్రీనివాస్ మాదిగ

తమిళనాడులో కొత్త రాజకీయ అధ్యాయం ప్రారంభం కావాలి

సిద్దిపేట:

తమిళనాడులో కొత్త రాజకీయ అధ్యాయం ప్రారంభం కావాలని తిమ్మాపూర్ సర్పంచ్ గుర్రాల శ్రీనివాస్ మాదిగ అన్నారు.ఈ మేరకు మంగళవారం దుబ్బాక మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో విలేకర్లతో మాట్లాడారు. ముందుగా తమిళనాడు రాజకీయ పరిణామాలపై స్పందిస్తూ ప్రముఖ సినీ నటుడు, యూత్ ఐకాన్, TVK పార్టీ అధినేత శ్రీ జోసెఫ్ (యోసేపు) విజయ్ గారికి ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్కువ సమయంలోనే ప్రజల్లో విశేష ఆదరణ పొందిన విజయ్  భవిష్యత్తులో తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఆయన నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా మరింత ముందుకు సాగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.అలాగే యువతకు ఆదర్శంగా నిలుస్తున్న విజయ్ గారి రాజకీయ ప్రయాణం విజయవంతం కావాలని కోరుతూ, తమిళనాడులో కొత్త రాజకీయ అధ్యాయం ప్రారంభం కావాలని అభిలషించారు.

About The Author