ఓటరు జాబితాలో తప్పుల్లేకుండా చూద్దాం!

  • ఇంటింటికీ వస్తున్న బీఎల్ఓలకు సహకరించండి: డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య
  • బడంగ్‌పేట్ సర్కిల్‌లో ముమ్మరంగా ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ

ఓటరు జాబితాలో తప్పుల్లేకుండా చూద్దాం!

బడంగ్‌పేట్:

 ఓటరు జాబితాలో తప్పులకు తావులేకుండా, పక్కాగా రూపొందించడమే లక్ష్యమని బడంగ్‌పేట్ సర్కిల్-16 డిప్యూటీ కమిషనర్ వి. సమ్మయ్య స్పష్టం చేశారు. సర్కిల్ పరిధిలో ప్రస్తుతం కొనసాగుతున్న ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని ఆయన మంగళవారం స్వయంగా పర్యవేక్షించారు. పలు కాలనీల్లో పర్యటించిన ఆయన.. మ్యాపింగ్ ప్రక్రియ, ప్రోజెనీ (కుటుంబ వివరాల) నమోదుపై ప్రజలకు అవగాహన కల్పించారు.

ఇంటి వివరాలు పక్కాగా ఇవ్వాలి..
బీఎల్ఓలు ఇంటింటికీ తిరిగి వివరాలు సేకరిస్తున్నారని, ఈ సమయంలో ప్రజలు తమ వ్యక్తిగత, కుటుంబ సమాచారాన్ని సరైన రీతిలో అందించి సహకరించాలని సమ్మయ్య విజ్ఞప్తి చేశారు. మ్యాపింగ్ ప్రక్రియ సక్రమంగా జరిగితేనే భవిష్యత్తులో ఓటరు కార్డులకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు. పారదర్శకమైన ఓటరు జాబితా తయారీలో ప్రజల భాగస్వామ్యం చాలా కీలకమని ఆయన పేర్కొన్నారు.

ఎక్కడెక్కడ.. ఎవరు
అందుబాటులో ఉంటారంటే?
ఓటర్ల మ్యాపింగ్, ప్రోజెనీ పూర్తి చేయించుకోవాలనుకునే వారు తమ పరిధిలోని ఈ కింది కేంద్రాల్లో బీఎల్ఓలను సంప్రదించవచ్చు:
 జిల్లెలగూడ పంచాయతీ ఆఫీస్: పీఎస్ నంబర్లు 135 నుంచి 144 వరకు.
 పాత మీర్‌పేట్ మున్సిపల్ ఆఫీస్: పీఎస్ నంబర్లు 145-154, 165-174, 186-196 వరకు.
 బుడగజంగం కమ్యూనిటీ హాల్ (లెనిన్ నగర్): పీఎస్ నంబర్లు 197 నుంచి 207 వరకు.
 బడంగ్‌పేట్ జెడ్పీ హైస్కూల్: పీఎస్ నంబర్లు 219 నుంచి 229 వరకు.
 శివనారాయణపురం కమ్యూనిటీ హాల్: పీఎస్ నంబర్లు 230 నుంచి 240 వరకు.
 అల్మాస్‌గూడ వార్డు ఆఫీస్: పీఎస్ నంబర్లు 241-258, 263-272 వరకు.
 రాజీవ్ గృహకల్ప గణేష్ మండపం (అల్మాస్‌గూడ): పీఎస్ నంబర్లు 254, 259 నుంచి 262 వరకు.
ఎలాంటి అనుమానాలు ఉన్నా వెనుకాడకుండా వెంటనే బీఎల్ఓలను లేదా సంబంధిత అధికారులను కలవాలని డిప్యూటీ కమిషనర్ సూచించారు. ఈ స్పెషల్ డ్రైవ్‌ను విజయవంతం చేసేందుకు సిబ్బంది రాత్రింబవళ్లు కష్టపడుతున్నారని ఆయన తెలిపారు.WhatsApp Image 2026-05-05 at 18.43.11 (1)

About The Author