బీసీ గురుకులాల్లో ఇంటర్మీడియట్ అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలి.
ఎల్బీనగర్:
మహాత్మా జ్యోతిభాపూలే తెలంగాణ బిసి గురుకుల ఇంటర్మీడియట్ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరంలో అడ్మిషన్ల కోసం విద్యార్దులు దరఖాస్తు చేసుకోవాలనీ హైదారాబాద్ ఉమ్మడి జిల్లాల బిసి గురుకులాల పాఠశాలలు మరియు కళాశాలల రీజినల్ కో ఆర్డినేటర్ (ఆర్సిఓ ) గౌతం కుమార్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 2025-26 సంవత్సరంలో పదవ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్దులు ఈ నెల 12 వ తేదీలోగా మీసేవ కేంద్రాలలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. హైదారాబాద్ జిల్లాలో 14 బాలుర మరియు 14 బాలికల కళాశాలలు(ఇంగ్లీష్ మీడియం) ఉన్నాయని, ఎంపీసీ, బైపిసి, సీఈసీ, హెచ్ఈసి మరియు ఈ సంవత్సరం ఏసీఈ కొత్త గ్రూప్ అందుబాటులో ఉన్నాయని, వృత్తి విద్యా కోర్సులో కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్ కూడా ఉన్నాయని ఆర్సీవో తెలిపారు. విద్యార్దులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలలో బిసి గురుకులం కళాశాలల విద్యార్థులు అత్యుత్తమ మార్కులతో ఉత్తీర్ణత సాధించారనీ ఆర్సీఓ చెప్పారు.
