రసాయన శాస్త్రంలో రమేష్ గౌరకు పీహెచ్.డీ.
పటాన్‌చెరు:
హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, రసాయన శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థి రమేష్ గౌర డాక్టరేట్ కు అర్హత సాధించారు. ‘మెథిమజోల్, లెవోడోపా, మిటాపివాట్ సల్ఫేట్, వారెనిక్లిన్ టార్ట్రేట్ అనే క్రియాశీల ఔషధ పదార్థాల వినూత్న సంశ్లేషణ పద్ధతుల అభివృద్ధి’పై ఆయన అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు.
ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ రసాయన శాస్త్ర విభాగం ప్రొఫెసర్ ఎం.ఎస్.సురేంద్ర బాబు సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు.
డాక్టర్ రమేష్ నాలుగు ముఖ్యమైన క్రియాశీల ఔషధ పదార్థాల (ఏపీఐల) కోసం నూతన, విస్తరించదగిన ప్రక్రియలను అభివృద్ధి చేసి, తద్వారా దిగుబడి, మలినాల నియంత్రణ, ప్రక్రియ భద్రత, పారిశ్రామిక సాధ్యతను గణనీయంగా మెరుగుపరిచినట్టు వివరించారు. ముఖ్యంగా, ఆయన చేసిన కృషిలో మెథమజోల్ కోసం క్వాలిటీ బై డిజైన్ (క్యూబీడీ) ఆధారిత పటిష్టమైన ప్రక్రియ, లెనోడోపా కోసం సరళీకృత రెండు దశల సంశ్లేషణ, మిటాపివాట్ సల్ఫేట్ కోసం ఆప్టిమైజ్ చేసిన బహుళ దశల మార్గం, అధిక స్వచ్ఛత, నియంత్రణ సమ్మతిని నిర్ధారించే వేరెనిక్లిన్ టార్ట్రేట్ కోసం నైట్రోసమైన్ రహిత మార్గం ఉన్నాయని రుజువు చేశాడన్నారు.
డాక్టర్ రమేష్ సిద్ధాంత వ్యాసం పీహెచ్.డీ. పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం హైదరాబాదు అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.రెజా, రసాయన శాస్త్ర విభాగాధిపతి డాక్టర గౌసియా బేగం, పలు విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు అభినందనలు తెలియజేసినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
