మోడీ సభ విజయవంతం చేయండి
అమీన్‌పూర్:
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అదెల్లి రవీందర్ ఎడ్ల రమేష్
మోడీ సభ మే 10 పెరేడ్ గ్రౌండ్ లో జరుగుతుందని ఇట్టి సభను భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలనీ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అదెల్లి రవీందర్ రాష్ట్ర నాయకులు ఎడ్ల రమేష్ పేర్కొన్నారు. బీరంగూడ డివిజన్ కన్వీనర్ ఆగరెడ్డి ఆధ్వర్యంలో బీరంగూడ లో ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్ అస్సాం పూడూచ్చేరి భారీ విజయం అందించిన ప్రజలకు ధన్యవాదములు తెలిపారు. జరిగిన ఎన్నికల్లో మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీ dmk తదితర పార్టీలకు ప్రజలు బుద్దిచెప్పారని పేర్కొన్నారు. తెలంగాణ లో మోడీ దిశా నిర్దేశం చేస్తారని తెలంగాణ లో వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపు తత్యం అని తెలిపారు. మోడీ సభను భారీగా హాజరై విజయవంతం చేయాలనీ పిలుపు నిచ్చారు. ఈకార్యక్రమంలో బీజేపీ బీరంగూడ డివిజన్ కన్వినర్ ఆగరెడ్డి, ప్రధాన కార్యదర్శి రమేష్ రెడ్డి, గోపి, శ్రవణ్, లక్ష్మణ్ గుప్త , లక్ష్మయ్య మొదలగు వారు పాల్గొన్నారు.
