సాకి చెరువులో గుర్రపు డెక్క తొలగింపు పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్..
పటాన్‌చెరు:
చెరువుల సంరక్షణ కోసం శరవేగంగా గుర్రపుడెక్క తొలగింపు పనులను చేపడుతున్నట్లు పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.
పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని సాకి చెరువులో 70 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న గుర్రపు డెక్క తొలగింపు పనులను గురువారం ఉదయం ఆయన ప్రారంభించారు.
గుర్రపు డెక్క తొలగించడం వలన చెరువు నీటి సామర్థ్యం పెరగడంతో పాటు చెరువుల పరిశుభ్రత మెరుగుపడటం, భూగర్భ జలాలు మట్టం పెరగడం వంటి లాభాలు జరుగుతాయని తెలిపారు.

About The Author
07 May 2026
