ఇచ్చిన మాట ప్రకారం విద్యార్థులకు కొత్త బట్టల బహుమతి
ఎల్బీనగర్:
ఆర్కేపురం చిత్రా లే అవుట్ లోని అనాథ విద్యార్థి గృహ విద్యార్థులు పదవ తరగతిలో 90% పైన మార్కులు సాధించిన పి గోపి,వి.మహేష్ ఎమ్. శ్రీవర్ లకు కొత్తపేట లక్ష్మి నగర్ కు చెందిన ఉప్పలపాటి రాజశేఖర్ కొత్త బట్టలను బహుకరించడం జరిగింది. అలాగే 70, 80 % సాధించిన విద్యార్థుల అందరికీ కూడా కొత్త బట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ, ఇంటర్మీడియట్ లో 90% పైన మార్కులు సాధించిన విద్యార్థులకు కొత్త బట్టలు ఇచ్చిన సమయంలో అన్ని పరీక్షలలో 90% సాధించిన విద్యార్థులకు కొత్త బట్టలు బహుమతిగా ఇస్తామని మాట ఇచ్చానని, ఆ మాట ప్రకారం ఈ రోజు పదవ తరగతి విద్యార్థులకు నూతన వస్త్రాలు ఇచ్చామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గృహ అధ్యక్షులు మార్గం రాజేష్,కేవిఎస్ హనుమాన్, గృహ విద్యార్థులు పాల్గొన్నారు.
About The Author
07 May 2026
