పదవ తరగతి ప్రతిభావంతులకు విద్యా పురస్కారం

- మిరుదొడ్డిలో ఘనంగా పురస్కారాల ప్రదానోత్సవం
- విద్యార్థులను అభినందించిన దుబ్బాక ఎమ్మెల్యే 

పదవ తరగతి ప్రతిభావంతులకు విద్యా పురస్కారం

సిద్దిపేట:


పట్టుదలతో చదివి పదవ తరగతి ఫలితాల్లో సత్తా చాటిన విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల ఆణిముత్యాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అభినందించారు.
మంగళవారం మిరుదొడ్డి మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మండపంలో ప్రభుత్వ విద్య పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో 2025-26 విద్యా సంవత్సరం పదవ తరగతి ఫలితాల్లో 500 పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు “ఉత్తమ ప్రతిభ విద్యా పురస్కారం” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.మండలంలోని వివిధ పాఠశాలల నుంచి 500కు పైగా మార్కులు సాధించిన సుమారు 90 మంది విద్యార్థులను ఈ సందర్భంగా సన్మానించారు. ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలను అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు స్పష్టమైన లక్ష్యాలతో ముందుకు సాగి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతున్నదని, తాజా ఫలితాలే దానికి నిదర్శనమని పేర్కొన్నారు.జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, మండలంలో ఇంత పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడం వెనుక ఉపాధ్యాయుల కృషి, తల్లిదండ్రుల ప్రోత్సాహం ముఖ్య పాత్ర పోషించాయని అన్నారు. భవిష్యత్తులో ఇంకా మెరుగైన ఫలితాలు సాధించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విద్య పరిరక్షణ వేదిక అధ్యక్షుడు పెద్దిరాజు, సర్పంచ్ మహేశ్వరి-దేవరాజు, మండల విద్యాధికారి ప్రవీణ్ బాబు, భారాస రాష్ట్ర నాయకులు కమలాకర్ రెడ్డి, నైపుణ్య ఆర్గనైజేషన్ చైర్మన్ ఐలయ్య,కొండాపూర్ సర్పంచ్ జిగిరి అమర్, గురుకులం ప్రిన్సిపాల్ రఘునందన్ రావు, మోడల్ స్కూల్స్ అర్చన, కేజీబీవీ ప్రత్యేక అధికారిణి స్వర్ణలత, స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.WhatsApp Image 2026-05-05 at 19.41.51

About The Author