ఈ నెల 11న సరూర్ నగర్ స్టేడియంలో మెగా జాబ్ మేళా
162 ప్రముఖ కంపెనీలు పాల్గొనే అవకాశం
ఎల్బీనగర్:
యువజన సేవలు, క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఈనెల 11న సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు సరూర్నగర్ మండల తహసీల్దార్ పి. వేణుగోపాల్, సరూర్ నగర్ జిహెచ్ఎంసి సర్కిల్ 12 డిప్యూటీ కమిషనర్ బోనగిరి శ్రీనివాస్ ఇరువురు కలిసి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ మేళాలో 162 ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయన్నారు. ఐటీ హెల్త్, ఇండస్ట్రియల్, ఫార్మా, రిటైల్, బ్యాంకింగ్, ఫైనాన్స్, మార్కెటింగ్, సేవారంగం తదితర అనేక విభాగాలకు చెందిన సంస్థలు పాల్గొంటాయని చెప్పారు. https://satg.telangana.gov.in/prajapalana/ వెబ్ లింక్ లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని ఇరువురు నిరుద్యోగులకు సూచించారు.
About The Author
07 May 2026
