జుబ్లీహిల్స్‌లో అత్యాధునిక 'ఎన్ విజన్ లాసిక్ సెంటర్' ప్రారంభం
ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్
జుబ్లీహిల్స్:
సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని వైద్య రంగంలో మరిన్ని మెరుగైన సేవలు అందించడం అభినందనీయమని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ అన్నారు. జుబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ సాయిబాబా గౌడ్ కుమారుడు డాక్టర్ అద్వైత్ నూతనంగా ఏర్పాటు చేసిన *'ఎన్ విజన్ లాసిక్ సెంటర్' (కంటి ఆసుపత్రి)*ను ఆదివారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా మధుయాష్కి గౌడ్ మాట్లాడుతూ.. అంతర్జాతీయ ప్రమాణాలతో, అధునాతన సాంకేతికతతో ఈ ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకువచ్చిన డాక్టర్ అద్వైత్, డాక్టర్ సింధూరలను ప్రత్యేకంగా అభినందించారు. కంటి సమస్యలతో బాధపడేవారికి ఈ కేంద్రం ఎంతో ఊరటనిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
జ్యోతి గారికి సన్మానం
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని, దేవనార్ అంధుల పాఠశాల కరస్పాండెంట్ జ్యోతి గారిని మధుయాష్కి గౌడ్ ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. సమాజ సేవలో ఆమె చేస్తున్న కృషిని వారు కొనియాడారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు డాక్టర్ గౌడ్స్ డెంటల్ ఆసుపత్రుల వ్యవస్థాపకులు డాక్టర్ ఎం.ఎస్. గౌడ్, హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పాశం అశోక్ గౌడ్, కర్మన్‌ఘాట్ హనుమాన్ దేవాలయ డైరెక్టర్ నరేష్ తదితరులు పాల్గొన్నారు.
.jpeg)
