మహానయీం చర్చి వార్షికోత్సవంలో ఈటల రాజేందర్

  • ఘనంగా 45వ వార్షిక వేడుకలు
  • హాజరైన మాజీ కార్పొరేటర్ లచ్చిరెడ్డి

మహానయీం చర్చి వార్షికోత్సవంలో ఈటల రాజేందర్

బి.ఎన్.రెడ్డి నగర్: 

స్థానిక శ్రీ సాయిరాం కాలనీలోని మహానయీం పూర్ణ సువార్త దైవ సమాజం (మహానయీం ఫుల్ గాస్పల్ చర్చి ఆఫ్ గాడ్) 45వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. చర్చి నిర్వాహకులు జాన్ బాబు, జాన్ బోయాని ఆహ్వానం మేరకు మల్కాజ్‌గిరి పార్లమెంటు సభ్యుడు ఈటల రాజేందర్, బి.ఎన్.రెడ్డి నగర్ మాజీ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

సభ్యులకు శుభాకాంక్షలు
ఈ సందర్భంగా చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. చర్చి సభ్యులందరికీ 45వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. సమాజంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు శాంతికి దోహదపడతాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు.. కాలనీ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, నిర్వహణ కార్యదర్శి సంజీవరెడ్డి, కోశాధికారి కోటేశ్వరరావు, కన్వీనర్ హరికృష్ణ పాల్గొన్నారు. వీరితో పాటు రాజకీయ నాయకులు నూతి శ్రీనివాస్, సీదార్ల జాన్, ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, నాయకులు సుధీర్, చిన్న యాదవ్, కౌశిక్, శబరి నాథ్, దిలీప్ గౌడ్, యువజన విభాగం అధ్యక్షుడు సురేష్ కుమార్, మనోజ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About The Author