అమీన్‌పూర్‌లో గీతాంజలి స్కూల్ ప్రారంభం.. పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగ రెడ్డి

అమీన్‌పూర్‌లో గీతాంజలి స్కూల్ ప్రారంభం.. పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగ రెడ్డి

అమీన్‌పూర్:

అమీన్‌పూర్ జీహెచ్‌ఎంసీ పరిధిలోని సాయి రామ్  ఎంక్లేవ్ ఫేస్-2లో గీతాంజలి పాఠశాల నూతన శాఖను ఆదివారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి హాజరుకాగా, ఆయనతో పాటు అమీన్‌పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, మాజీ చైర్మన్ కలిసి రిబ్బన్ కట్ చేసి పాఠశాలను లాంఛనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. అమీన్‌పూర్ ప్రాంతంలో అత్యాధునిక వసతులతో గీతాంజలి పాఠశాలను ప్రారంభించడం అభినందనీయమని అన్నారు. ఇప్పటికే ఇస్నాపూర్‌లో విద్యాబోధనలో మంచి పేరు సంపాదించుకున్న ఈ యాజమాన్యం, ఇప్పుడు అమీన్‌పూర్‌లో మరో పాఠశాలను ప్రారంభించడం సంతోషకరమని పేర్కొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన, ఉన్నతమైన విద్యను అందించడంలో ఈ పాఠశాల కీలక పాత్ర పోషించాలని ఆయన ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో అమీన్‌పూర్ మున్సిపల్ మాజీ ఎంపీపీ దేవానంద్, మాజీ జడ్పిటిసి సుధాకర్ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్,మాజీ కౌన్సిలర్ కొల్లూరి గోపాల్, బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు ఐలాపుర్ నరసింగరావు, అమీన్‌పూర్ ఎంఈఓ సుధాకర్, పాఠశాల యాజమాన్యం, స్థానిక నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.WhatsApp Image 2026-06-14 at 21.01.45 (1)

About The Author