భారీగా గంజాయి పట్టివేత.. కియా కారులో అక్రమ రవాణా!
- ఒడిశా టు మహారాష్ట్ర.. రూ. 41.21 లక్షల సరుకు సీజ్
- ముఠా గుట్టురట్టు చేసిన మల్కాజిగిరి SOT, అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు
- ఇద్దరు నిందితుల అరెస్ట్.. 164.86 కిలోల గంజాయి స్వాధీనం
హయత్‌నగర్:
సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశ.. అడ్డదారిలో డ్రగ్స్ రవాణా! ఒడిశా నుంచి కారులో గంజాయిని తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును మల్కాజిగిరి ఎస్‌ఓటీ, అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు సంయుక్తంగా రట్టు చేశారు. ఆదివారం మధ్యాహ్నం జరిపిన మెరుపు తనిఖీల్లో సుమారు రూ. 41.21 లక్షల విలువైన 164.86 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, రవాణాకు వాడిన కియా కారుతో పాటు రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
ట్రిప్పుకు 60 వేల ఆశ చూపి..
కారు డిక్కీలో 80 ప్యాకెట్లు..
గతం నుంచి గంజాయి అలవాటే!
నిందితుడు నబిన్ సాబర్‌పై గతంలోనూ ఒడిశాలోని సాదర్ బెహ్రాంపూర్ పీఎస్‌లో కేసు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులపై ఎన్.డి.పి.ఎస్ (NDPS) చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఆపరేషన్‌లో ఎల్‌బీ నగర్ జోన్ డీసీపీ డా. బి. అనురాధ, ఎస్‌ఓటీ అధికారులు, అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
