కొనసాగుతున్న ఎన్‌ ఐఏ సోదాలు

విజయవాడ, అక్టోబరు 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఏకకాలంలో పలు ప్రాంతాల్లో ఎన్‌ఐఏ బృందాలు సోదాలు జరుపుతున్నాయి. హైదరాబాద్‌, తిరుపతి, నెల్లూరు, గుంటూరు, శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల్లో పలువురి ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి.తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో ఎన్‌ఐఏ సోదాలు జరుపుతోంది. సోమవారం తెల్లవారక ముందే స్థానిక పోలీసుల సహకారంతో భారీ ఎత్తున తనిఖీలు చేపట్టింది. గుంటూరు జిల్లా పొన్నూరులో పౌర హక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ రాజారావు నివాసంలో సోదాలు చేపట్టారు. పొన్నూరులో ప్రజావైద్యశాల నిర్వహిస్తున్న రాజారావు ఇంట్లో సోదాలు చేయడం కలకలం రేపింది.నెల్లూరు జిల్లాలో పౌర హక్కుల సంఘం నాయకుడు వెంకటేశ్వర్లు ఇంట్లో ఎన్‌ఐఏ బృందాలు సోదాలు చేపట్టాయి. రాష్ట్ర వ్యాప్తంగా పౌరహక్కుల సంఘం నాయకులు, న్యాయవాదుల ఇళ్లలో ఎన్‌ఐఏ సోదాలు జరుపుతోంది. మావోయిస్టులకు సహకరిస్తున్నారనే అనుమానంతో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు.శ్రీకాకుళంలో కులనిర్మూలన పోరాట మిస్కా కృష్ణయ్య నివాసంలో సోదాలు చేపట్టారు. నెల్లూరులో పౌర హక్కుల సంఘం నాయకులు అరుణ, వెంకటేశ్వరరావు నివాసంలో సోదాలు నిర్వహించారు. నెల్లూరు ఉస్మాన్‌ సాహెబ్‌పేటలో ఎల్లంకి వెంకటేశ్వర్లు ఇంట్లో సోదాలు జరుపుతున్నారు. ఏపీ సిఎల్‌సి ప్రధాన కార్యదర్శి ఎల్లంకి వెంకటేశ్వర్లు నివాసంలో ఎన్‌ఐఏ దాడులు చేయడం కలకలం రేపింది.

కొనసాగుతున్న ఎన్‌ ఐఏ సోదాలు

విజయవాడ, అక్టోబరు 2
తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఏకకాలంలో పలు ప్రాంతాల్లో ఎన్‌ఐఏ బృందాలు సోదాలు జరుపుతున్నాయి. హైదరాబాద్‌, తిరుపతి, నెల్లూరు, గుంటూరు, శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల్లో పలువురి ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి.తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో ఎన్‌ఐఏ సోదాలు జరుపుతోంది. సోమవారం తెల్లవారక ముందే స్థానిక పోలీసుల సహకారంతో భారీ ఎత్తున తనిఖీలు చేపట్టింది. గుంటూరు జిల్లా పొన్నూరులో పౌర హక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ రాజారావు నివాసంలో సోదాలు చేపట్టారు. పొన్నూరులో ప్రజావైద్యశాల నిర్వహిస్తున్న రాజారావు ఇంట్లో సోదాలు చేయడం కలకలం రేపింది.నెల్లూరు జిల్లాలో పౌర హక్కుల సంఘం నాయకుడు వెంకటేశ్వర్లు ఇంట్లో ఎన్‌ఐఏ బృందాలు సోదాలు చేపట్టాయి. రాష్ట్ర వ్యాప్తంగా పౌరహక్కుల సంఘం నాయకులు, న్యాయవాదుల ఇళ్లలో ఎన్‌ఐఏ సోదాలు జరుపుతోంది. మావోయిస్టులకు సహకరిస్తున్నారనే అనుమానంతో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు.శ్రీకాకుళంలో కులనిర్మూలన పోరాట మిస్కా కృష్ణయ్య నివాసంలో సోదాలు చేపట్టారు. నెల్లూరులో పౌర హక్కుల సంఘం నాయకులు అరుణ, వెంకటేశ్వరరావు నివాసంలో సోదాలు నిర్వహించారు. నెల్లూరు ఉస్మాన్‌ సాహెబ్‌పేటలో ఎల్లంకి వెంకటేశ్వర్లు ఇంట్లో సోదాలు జరుపుతున్నారు. ఏపీ సిఎల్‌సి ప్రధాన కార్యదర్శి ఎల్లంకి వెంకటేశ్వర్లు నివాసంలో ఎన్‌ఐఏ దాడులు చేయడం కలకలం రేపింది.

About The Author

Related Posts