బీబీపేట మండలంలోని వరి ధాన్య కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్
కామారెడ్డి జిల్లా:
జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శుక్రవారం బీబీపేట మండలంలోని వరి ధాన్య కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. కేంద్రానికి రైతులు తీసుకొచ్చిన ధాన్యం నాణ్యత, తూకం విధానం, హమాలీ సౌకర్యాలు, రవాణా ఏర్పాట్లపై ఆరా తీశారు.
అకాల వర్షాల నేపథ్యంలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఆలస్యం చేయకుండా వెంటనే మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం తడవకుండా టార్పాలిన్లు, అవసరమైన రక్షణ చర్యలు తప్పనిసరిగా చేపట్టాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వేగవంతంగా కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపారు.
కలెక్టర్ వెంట సివిల్ సప్లయ్ అధికారి వెంకటేశ్వర్లు, డిఎమ్ శ్రీకాంత్ డిసిఓ రామ్ మోహన్, సంబంధిత అధికారులు, కొనుగోలు కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు.
About The Author
29 May 2026
