మహిళా సాధికారతకు పెద్దపీట

మహిళలు అని రంగాల్లో అభివృద్ధి చెందాలి: ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు

మహిళా సాధికారతకు పెద్దపీట

మంచిర్యాల :

ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక మహిళ వారోత్సవాల్లో శుక్రవారం రోజున జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ కుమార్ దీపక్ తో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు కలిసి పాల్గొన్నారు.నియోజకవర్గ స్వయం సహాయక సంఘాలకు 53,10,75,000 /- రూపాయల చెక్కును కలెక్టర్, ఎమ్మెల్యే అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు మాట్లాడుతూ మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ స్వయం సహాయక సంఘాల మహిళలకు భారీ ఆర్థిక చేయూతనిచ్చేలా చెక్కులను అందజేశాము అని అన్నారు. గ్రామీణ ప్రాంతాల సమగ్ర వికాసమే ధ్యేయంగా మహిళల ఉపాధిని, స్థానిక వసతులను పెంపొందించేలా హెచ్‌పీ పెట్రోల్ బంక్ కుడా ఇవ్వడం జరుగుతుందన్నారు. మంచిర్యాల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలపడమే నా లక్ష్యం అని చెప్పారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య,డి ఆర్ డి ఏ కిషన్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, హజీపూర్, లక్షెట్టీపేట్, దండేపల్లి మండలాల మహిళా సంఘాల సభ్యులు , ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

About The Author