నిబంధనలు ‘గాల్లో’.. అక్రమ నిర్మాణాలు ‘జోరుగా’..!

  • హయత్ నగర్‌లో నిబంధనలు ఉల్లంఘిస్తున్న ఎస్.వి.ఎస్. గార్డెన్స్ ఫంక్షన్ హాల్
  • *మున్సిపల్ అనుమతులు లేవు.. ఫైర్ సేఫ్టీ అనుమతుల ఊసే లేదు!
  • *పక్కనే పెట్రోల్ బంక్.. ప్రమాదకరంగా మారుతున్న భారీ కట్టడం
  • *పట్టణ ప్రణాళికా విభాగం అధికారుల కళ్ళు మూతల.. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న వైనం!
  • హయత్ నగర్ సర్కిల్ 14 లో రాతపూర్వక ఫిర్యాదులపై చర్యలు శూన్యం, 
  • ఈ ఎస్వీఎస్ గార్డెన్ ఫంక్షనల్ నిర్మాణ అనుమతులు తీసుకోకుండా కోట్లల్లో పన్ను ఎగవేత..!
  • ఎం.ఎం.సి ఎల్బీనగర్ జోనల్ కమిషనర్, కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, విజిలెన్స్ అధికారులు దృష్టి సారించాలి..

నిబంధనలు ‘గాల్లో’.. అక్రమ నిర్మాణాలు ‘జోరుగా’..!

హయత్ నగర్:
అధికారుల పర్యవేక్షణ లోపం, కొందరి అండదండలతో హయత్ నగర్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా భారీ అక్రమ నిర్మాణం జోరుగా సాగుతోంది. మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఎల్బీనగర్ జోన్ పరిధిలోని హయత్ నగర్ సర్కిల్ 14లో ఉన్న స్థానిక సాయి కాలనీ, తొర్రూర్ రోడ్డులోని సర్వే నెంబర్ 350లో గల "ఎస్.వి.ఎస్. గార్డెన్స్ ఫంక్షన్ హాల్" ఆవరణలో నగరపాలక సంస్థ నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కుతూ పెద్ద ఎత్తున నిర్మాణ పనులు చేపడుతున్నారు. కేవలం 'రేషన్ వర్క్' (మరమ్మతులు) పేరుతో ఏకంగా ఎలాంటి పురపాలక అనుమతులు లేకుండానే ఈ పనులు సాగుతుండటం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.WhatsApp Image 2026-05-25 at 20.09.35

*రెండు ఎకరాల విస్తీర్ణంలో నిబంధనల ఉల్లంఘన..!
దాదాపు రెండు ఎకరాల భారీ విస్తీర్ణంలో ఈ ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులను ఎలాంటి ప్లాన్ అప్రూవల్ లేకుండానే కొనసాగిస్తున్నారు. సాధారణంగా ఇంత పెద్ద మొత్తంలో కమర్షియల్ నిర్మాణాలు చేపట్టాలంటే స్థానిక పురపాలక సంస్థ నుండి భవన నిర్మాణ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి. కానీ, ఇక్కడ ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండానే గుట్టుచప్పుడు కాకుండా పనులు కానిచ్చేస్తున్నారు.

*నిప్పుతో చెలగాటం: పక్కనే పెట్రోల్ బంక్.. శూన్యమైన ఫైర్ సేఫ్టీ!

ఈ నిర్మాణంలో అత్యంత ప్రమాదకరమైన అంశం ఏమిటంటే.. ఈ ఎస్.వి.ఎస్. గార్డెన్స్ ఫంక్షన్ హాల్‌కు సరిగ్గా ఆనుకొనే ‘భారత్ పెట్రోల్ బంక్’ మరియు ‘శ్రీ వైష్ణో దేవి ఫిలిం స్టేషన్’ఉన్నాయి.WhatsApp Image 2026-05-25 at 20.09.45 (1)

 *ఫైర్ సేఫ్టీ నిబంధనల ఉల్లంఘన:
అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉండే పెట్రోల్ బంక్ పక్కనే వందలాది మంది కూడే ఫంక్షన్ హాల్‌ను నిర్మిస్తున్నప్పుడు కఠినమైన ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు పాటించాలి. కానీ, ఇక్కడ కనీస నిబంధనలు కూడా పాటించడం లేదు.

 *బఫర్ జోన్ ఉల్లంఘన: 
చట్ట ప్రకారం పెట్రోల్ బంకులు, ఫిలిం స్టేషన్ల పక్కన కమర్షియల్ నిర్మాణాలు చేపట్టేటప్పుడు నిర్దేశిత ఖాళీ స్థలాన్ని (బఫర్ జోన్‌) వదలాలి. ఇక్కడ ఆ నిబంధనలు ఎక్కడా అమలు కావడం లేదు. భవిష్యత్తులో ఏదైనా ప్రమాదం జరిగితే వందలాది మంది ప్రాణాలు గాల్లో కలవడం ఖాయంగా కనిపిస్తోంది.

టౌన్ ప్లానింగ్ నిర్లక్ష్యం.. వ్రాతపూర్వక ఫిర్యాదులున్నా నిమ్మకు నీరెత్తినట్లే!
ఈ భారీ అక్రమ నిర్మాణంపై పట్టణ ప్రణాళికా విభాగం (టౌన్ ప్లానింగ్) అధికారులైన టి.పి.ఎస్. సోమేష్, జె.సి.పి. విజయలక్ష్మి మరియు ఇన్‌చార్జ్ డిప్యూటీ కమిషనర్‌కు స్థానికులు అన్ని ఆధారాలతో వ్రాతపూర్వకంగా ఫిర్యాదులు చేశారు. పత్రికల్లో వార్తలు వచ్చినా, ఆధారాలు కళ్లముందున్నా చర్యలు తీసుకోవడంలో వీరు పూర్తిగా విఫలమయ్యారు. నిబంధనలను అమలు చేయాల్సిన అధికారులే ఇక్కడ అక్రమ నిర్మాణదారులకు పరోక్షంగా సహకరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

*ప్రధాన ఉల్లంఘనలు ఇవే:
పురపాలక అనుమతులు లేకపోవడం:
నిర్మాణానికి సంబంధించిన ఎలాంటి అధికారిక భవన నిర్మాణ అనుమతి లేదు.

ల్యాండ్ యూజ్ ఉల్లంఘన: నివాస/వాణిజ్య నిబంధనలకు విరుద్ధంగా భారీ నిర్మాణం.

 *ఫైర్ ఎన్‌ఓసీ  లేకపోవడం: పెట్రోల్ బంక్ పక్కన నిర్మిస్తున్నా అగ్నిమాపక శాఖ నుండి ఎటువంటి అనుమతులు తీసుకోలేదు.

*పార్కింగ్, రోడ్డు వెడల్పు సమస్యలు:
 తొర్రూర్ రోడ్డు, పాత జి. స్కూల్ రోడ్డు పరిధిలో రాకపోకలకు అంతరాయం కలిగేలా, సరైన వాహన నిలుపుదల స్థలం లేకుండానే పనులు జరుగుతున్నాయి.WhatsApp Image 2026-05-25 at 20.09.35 (1)

*ఖజానాకు గండి.. విజిలెన్స్ నిఘా అవసరం!
ఈ అక్రమ నిర్మాణాల వల్ల ప్రభుత్వ ఖజానాకు చేరవలసిన భారీ పన్నుల ఆదాయం మళ్లిపోతోందని, అధికారుల అండతోనే ఇదంతా సాగుతోందని స్థానికులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు, విజిలెన్స్ (నిఘా విభాగం) అధికారులు తక్షణమే స్పందించి, క్షేత్రస్థాయిలో పరిశీలన జరపాలి. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ భారీ అక్రమ నిర్మాణాన్ని నిలిపివేసి, బాధ్యులైన అధికారులపై, నిర్మాణదారులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.

About The Author