మెగా జాబ్ మేళాను ప్రారంభించిన ట్రస్ట్ ఛైర్మెన్&ఫౌండర్ ఝాన్సీరెడ్డి.

మెగా జాబ్ మేళాను ప్రారంభించిన ట్రస్ట్ ఛైర్మెన్&ఫౌండర్ ఝాన్సీరెడ్డి.

జనగామ:


పాలకుర్తి మండలకేంద్రంలోని శ్రీ సోమేశ్వర స్వామి కళ్యాణ మండపంలో హనుమండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి ఫ్యామిలీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాను ట్రస్ట్ ఫౌండర్&చైర్మన్,టీపీసీ‌సీ వైస్ ప్రెసిడెంట్ హనుమండ్ల ఝాన్సీరెడ్డి స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్,ఫౌండర్ ఝాన్సిరెడ్డి మాట్లాడుతూ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ జాబ్ మేళాను ఏర్పాటు చేశామని,పాలకుర్తి నియోజకవర్గంలోని నిరుద్యోగ యువత తమ ప్రతిభను నిరూపించుకునేందుకు ఇది మంచి వేదికగాఉపయోగపడుతుందని,చదువు పూర్తి చేసి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు ప్రైవేట్ రంగంలో అవకాశాలు కల్పించేందుకు ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని,ఈ మెగా జాబ్ మేళాలో పలు ప్రముఖ కంపెనీలు పాల్గొని అభ్యర్థుల అర్హతలను పరిశీలించి ఇంటర్వ్యూలు నిర్వహించాయని,10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, బీటెక్, పీజీ పూర్తి చేసిన యువత పాల్గొన్నారని,ఉదయం నుంచే యువత కళ్యాణ మండపానికి భారీగా చేరుకొని తమ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకుని ఇంటర్వ్యూలకుహాజరయ్యారని,జాబ్ మేళా ప్రాంగణంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాలంటీర్లు సహాయం అందించారని,యువతలో ఆత్మవిశ్వాసం పెంపొందించేలా కెరీర్ గైడెన్స్, ఉద్యోగ అవకాశాలపై అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించారని,యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం సమాజ అభివృద్ధికి ఎంతో అవసరమని,నిరుద్యోగసమస్యను తగ్గించేందుకు మా ట్రస్ట్ తరపున భవిష్యత్తులో కూడా మరిన్ని ఉపాధి కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ,పాలకుర్తి,దేవరుప్పుల,కొడకండ్ల మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గిరగాని కుమారస్వామి,నల్ల శ్రీరామ్,ధారావత్ సురేష్ నాయక్,స్థానికప్రజాప్రతినిధులు,కాంగ్రెస్పార్టీనాయకులు,యువజన నాయకులు,ట్రస్ట్ సభ్యులు,వాలంటీర్లు,నిరుద్యోగ యువత పాల్గొన్నారు.

About The Author