ఉస్మాన్ నగర్ మల్లన్న జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్..
రామచంద్రాపురం:
తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని ఉస్మాన్ నగర్ గ్రామంలో సోమవారం నిర్వహించిన శ్రీ శ్రీ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం, జాతర కార్యక్రమాలలో పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. హాజరైన సీనియర్ నాయకులు సోమిరెడ్డి, చిట్టి ఉమేష్, రామ్మోహన్ రెడ్డి, మల్లారెడ్డి, శ్రీశైలం, రవీందర్ రెడ్డి, నర్సింహా, రవీందర్ రెడ్డి, దేవేందర్ యాదవ్, ఆలయ కమిటీ సభ్యులు, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
About The Author
26 May 2026
